భయపెడుతున్న వందేళ్ల పోచారం ప్రాజక్టు

1917 లో నిజాం నిర్మించిన ప్రాజక్టు ఈ రోజు తొలిసారి వరద పరీక్షను ఎదుర్కొంటున్నది;

Update: 2025-08-28 04:53 GMT
పోచారం ప్రాజక్టు మీద నుంచి పొర్లి పారుతున్న మంచిప్ప బ్రూక్

కామారెడ్డి జిల్లాలో కురిసిన కుండపోత వర్షాలకు నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఈ ప్రాజక్టు నిర్మించిన మంచిప్ప బ్రూక్ (మంచిప్పవాగు)లో ఎంతవరద వచ్చిందంటే, ప్రాజక్టు బండ్ మునిగిపోయి పైనుంచి వరద ప్రవహిస్తూ ఉంది. ప్రాజక్టు ఇలా మునిగిపోవడం అనేది అరుదు. నిన్నటికే ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. అన్ని గేట్లు ఎత్తి నీళ్లు నీటిని విడుదల చేశారు. అయినా  భారీ ఎత్తున వరదకు ప్రాజెక్టు లోకి వస్తున్నది. ప్రాజక్టు మీది నుంచి వరద దూకుతుండటంతో అధికారులు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పైకి ఇలా ఆందోళన కలిగిస్తున్నా ఇంతవరకు ప్రాజక్టుకు ఎలాంటి హానిజరగలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు.

రికార్డు స్థాయిలో వరద నీరు

బుధవారం (ఆగస్టు 27) రికార్డు స్తాయిలో ఒక లక్ష 15 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1.82 టీయంసీలు. దీంతో ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. దీంతో ఏ క్షణమైనా ప్రాజెక్ట్ కు ముప్పు సంభవించవచ్చునని అధికారులు గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ ప్రాజక్టు కింద 14 గ్రామాలున్నాయి. ప్రభావిత ప్రాంతాల ప్రజలను ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించి సురక్షిత స్థలాలకు తరలిస్తున్నారు.

కట్టిన ప్రాజక్టులు పూర్తికాక ముందే కూలుతున్న ఈ రోజుల్లో వందేళ్ల  కిందట నిజాం కట్టిన ప్రాజక్టు  వరదలకు చెక్కుచెదరకూడా నిలబడింది. దీని మీద తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి  ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసలు కురిపించారు.



ప్రాజక్టు వందేళ్ల చరిత్ర

హైదరాబాద్ నిజాం ఈ ప్రాంతంలో నిర్మించిన మొదటి ప్రాజెక్ట్ పోచారం ప్రాజెక్ట్. 1917 లో నాగిరెడ్డిపేట మండలంలోని మంచిప్ప బ్రూక్‌ మీద పోచారం గ్రామంలో పోచారం ప్రాజెక్టుకు పునాదిరాయి వేశారు. అపుడది యునైటెడ్ నిజామాబాద్ జిల్లా. , ఇప్పుడు కామారెడ్డి జిల్లా.

2.423 టిఎంసి సామర్థ్యంతో రూ .17.11 లక్షల వ్యయంతో ఈ ప్రాజక్టును నిర్మించారు. నిర్మాణం 1922 లో పూర్తయింది. కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండల, మెదక్ జిల్లాలోని మెదక్ మండల నీటి అవసరాలను తీర్చడానికి ఈ ప్రాజక్టును ఆరోజుల్లొ నిర్మించారు. పోచారం గత 95 సంవత్సరాల నుండి నిజామాబాద్ మెదక్ జిల్లా ప్రజల నీటిపారుదల తాగునీటి అవసరాలను తీరుస్తోంది.


 



నిజాం ప్రభుత్వం సున్నపురాయితో ఈ ప్రాజెక్టును నిర్మించింది,ఈ ప్రాజెక్ట్ పొడవు 1.7 కి.మి. మంచిప్ప బ్రూక్ మీద నిర్మించిన ఈ ప్రాజక్టు కట్ట ఎత్తు 21 అడుగులు. దాని చుట్టూ 58 కిలోమీటర్ల పొడవైన కాలువలు తవ్వారు.

ఈ ప్రాజెక్టు కింద రైతులు 10,500 ఎకరాలు సాగు చేస్తున్నారు. మునుపటి ప్రాజెక్ట్ 2.423 టిఎంసి సామర్థ్యంతో నిర్మించబడింది. కానీ సిల్ట్ కారణంగా ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 1.82 టిఎంసికి తగ్గింది.

ప్రాజెక్ట్ మొత్తం నీటి సామర్థ్యం 1.82 టిఎంసి. పూర్తి రిజర్వాయర్ స్థాయి (ఎఫ్‌ఆర్‌ఎల్) 14.64 అడుగులు. ఇపుడు వరద నీటిని మంచప్ప బ్రూక్‌లోకి విడుదల చేస్తున్నారు.

పోచారం ప్రాజెక్ట్ కు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక నుండి పర్యాటకులు వస్తుంటారు. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, నాందేడ్, గుల్బర్గా జిల్లాల నుండి పోచారం ప్రాజెక్ట్ ఇక్కడ ఏర్పాటు చేసిన అభయారణ్యాన్ని సందర్శిస్తారు.పోచారం అభయారణ్యంలో వివిధ రకాల పక్షులు జంతువులు ఉన్నాయి.పోచారం ప్రాజెక్టు సమీపంలో నిజాం ప్రభుత్వం నిర్మించిన గెస్ట్ హౌస్ కూడా నిర్మించింది.

Tags:    

Similar News