సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో బాలిక అదృశ్యం
సిసి ఫుటేజి వల్ల క్లూ దొరికిందా?;
తన కుటుంబ సభ్యులతో రైలెక్కాలనుకుంది. వెంట ఫ్యామిలీ ఉంది కదా అంతా సేప్టీ అనుకుంది. ఇంతలో బాగా దాహం వేసింది. నీళ్ల బాటిల్ కొనుక్కుందామని అల్ఫా హోటల్ వైపు బయలు దేరిన ఆ బాలిక కనిపించకుండా పోయింది. బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాలిక అదృశ్యం కలకలం రేపింది. స్వంత రాష్ట్రమైన బీహార్ రాష్ట్రానికి, స్వంత మనుషులతో బయలుదేరుతున్న సమయంలో ఘటన చోటు చేసుకోవడం పలు అనుమానాలు తావిస్తుంది.
బాలిక ప్లాట్ ఫామ్ 5 నుంచి అల్ఫా హోటల్ వైపు వెలుతున్న సమయంలో సిసీటీవీ ఫుటేజిలో రికార్డయ్యింది. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఎప్పుడు రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో బాలిక అదృశ్యం వెనక పేరెంట్స్ నిర్లక్ష్యం ఎక్కువగా కనబడుతుంది. బాలికను ఒంటరిగా వదలడమేగాక కుటుంబ సభ్యులు ఆలస్యంగా రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే విలువైన సమయం కోల్పోవడంతో నిందితులను పట్టుకోవడంలో డిలే అవుతుంది. బాలిక ను ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనేది తేలడంలేదు.
రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ కు వెంటనే ఫోన్ చేస్తే నిందితులను పట్టుకునే చాన్స్ ఎక్కువగా ఉంటుంది.
చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా వదల కూడదు. కానీ భీహార్ అమ్మాయి మాత్రం ఒంటరిగా స్టేషన్ సమీపంలో ఉన్న హోటల్ వైపు వెళ్లినప్పుడు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల బాలికల అదృశ్యాల వెనక సంఘ విద్రోహశక్తులు ఉన్నట్లు వెల్లడౌతుంది. బీహార్ అమ్మాయి కూడా సంఘ విద్రోహశక్తుల చేతుల్లో వెళ్లిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.