షటిల్ ఆడుతుండగా గుండెపోటు
హైదరాబాద్ నాగోల్ లో కుప్పకూలిన అథ్లెట్ రాకేష్;
గుండెపోటుకు వృద్దాప్యంతో సంబంధంలేదు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న అథ్లెట్స్ కు గుండెపోట్లు వస్తున్నట్టు మరో మారు రుజువైంది. హైద్రాబాద్ నాగోల్ లో షటిల్ ప్రాక్టీసు చేస్తున్న అథ్లెట్ గుండెపోటుకు(Heart Attack) గురై చనిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
యుక్త వయసులో ఉన్న వారికి గుండెపోట్లు సంభవించడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది.
నాగోల్‌లో షటిల్ ఆడుతుండగా గుండ్ల రాకేశ్(25) స్టేడియంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సహచరులు అతడికి సిపిఆర్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో రాకేశ్ ను సమీప ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడిని ఖమ్మం జిల్లా తల్లాడ వాసిగా గుర్తించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉపసర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడే రాకేశ్. అతను హైద్రాబాద్ లో ఓ ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తూనే షటిల్ ప్రాక్టీసు చేస్తున్న అథ్లెట్ అని పోలీసులు తెలిపారు.