తెలంగాణలో భారీ వర్షాలు.. పలు రైళ్లు రద్దు

ట్రాక్ లు నీళ్లలో మునగడంతో దక్షిణమధ్య రైల్వే నిర్ణయం;

Update: 2025-08-28 15:45 GMT

తెలంగాణలో భారీగా కురుస్తున్న కుండపోత వర్షాలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. రైల్వే రవాణాపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. వరదనీటితో కొన్ని రైల్వే ట్రాక్‌లు మునిగిపోయాయి.దక్షిణ మధ్య రైల్వే అత్యవసర చర్యలు హుటాహుటిన చేపట్టింది.

తెలంగాణలో భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. దీంతో పాటు కొన్ని రైళ్లు దారి మళ్లించింది. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 36 రైళ్లు రద్దు, 25 రైళ్లు దారి మళ్లింపు, 14 రైళ్లను పాక్షిక్షంగా రద్దు చేసినట్లు ఆ ప్రకటనలో వివరించారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుసి అతలాకుతలమైంది. పలుచోట్ల రైలు ట్రాక్ పై వరద నీరు ముంచెత్తింది. దీంతో రైల్వే శాఖ చర్యలు చేపట్టింది.భారీవర్షాల నేపథ్యంలో రైల్వే ప్రయాణికులకు సహాయం కోసం హెల్ప్‌డెస్క్ నంబర్లను రైల్వే శాఖ ప్రకటించింది. నిజామాబాద్‌ - 97032 96714, కామారెడ్డి - 92810 35664, కాచిగూడ - 90633 18082, సికింద్రాబాద్‌ - 040 277 86170 నంబర్లను సంప్రదించాలని సూచించింది.

Tags:    

Similar News