కేటీఆర్‌కు 10రోజులే రిలీఫ్..
ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు విషయంలో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాడి వేడి విచారణ జరిగింది.
ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు విషయంలో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాడి వేడి విచారణ జరిగింది. కేటీఆర్ తరపు న్యాయవాది, ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఇద్దరూ కూడా నువ్వా నేనా అన్న తరహాలో వాదనలను విరిపించారు. ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయస్థానం కేటీఆర్‌కు స్వల్ప ఊరటను అందించింది. ఈ కేసులో జస్టిస్ శ్రవణ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పది రోజుల పాటు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం తెలిపింది. కాగా ఈ సమయంలో ఏసీబీని తన విచారణ జరిపించాలని తెలిపింది. కాగా తనపై దాఖలైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలన్న కేటీఆర్ పిటిషన్‌ను హైకోర్టు నిరాకరించింది. అనతరం ఈ కేసుపై విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసింది.
కోర్టులో వాదనలు ఇలా..
‘‘అవినీతి నిరోధక చట్టం కింది పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవు. ముఖ్యంగా 13(1)(a) సెక్షన్ ఈ కేసుకు వర్తించవు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆనేందుకు సరైన ఆధారాలు లేవు. ప్రొసిజర్ పాటించలేదనడం సరైనది కాదు. 14 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పరాథమిక విచారణ కూడా లేకుండా కేసు పెట్టారు8. కేవలం రాజకీయ కక్షసాధింపు కోసమే ఈ కేసుపై పెట్టారు. ఈ కేసులో ఎన్నో తప్పులు ఉన్నాయి. కార్ రేస్ నిర్వహణకు 2022 అక్టోబర్ 25న ఒప్పందం జరిగింది. సీజన్ 10 నిర్వహణకు స్పాన్సర్ సంస్థ వెనక్కు తగ్గారు. రేస్ నిర్వహణలో ఇబ్బందులను నివారించడం కోసమే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇబ్బందులు రాకూడదనే హెచ్ఎండీఏ చెల్లింపులు చేసింది. సీజన్-9 వల్ల దాదాపు రూ.700 కోట్ల లాభం వచ్చింది. ఆర్థికశాఖ అనుమతి లేదని ఏసీబీ అధికారులు అంటున్నారు. కార్ రేసింగ్ ఒప్పందానని కొత్త ప్రభుత్వం ఉల్లంఘించింది. కొత్త ప్రభుత్వం డబ్బు చెల్లించకపోవడంతో ఒప్పందం రద్దయింది. ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యానికి కారణాలు ఏంటో చెప్పలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం పనికిరాదు. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ప్రాథమిక విచారణ జరపాలి. ఈ విషయాలు సుప్రీంకోర్టు తీర్పుల్లో ఉన్నాయి. కానీ ఏసీబీ మాత్రం సుప్రీంకోర్టు తీర్పులను పట్టించుకోకుండా ప్రాథమిక దర్యాప్తు లేకుండానే కేసు నమోదు చేసేసింది. 18న ఫిర్యాదు అందగానే 19న ఎఫ్ఐఆర్ నమోదు చేసేశారు. అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పలేదు. కానీ ఏసీబీ కింద కేసు నమోదు చేశారు’’ అని కేటీఆర్ తరపు న్యాయవాది చెప్పారు.
దర్యాప్తులో అన్నీ తేలతాయి: ఏజీ
ఈ కేసులో ప్రభుత్వం తరపు న్యాయవాది ఏజీ సుదర్శన్ రెడ్డి కూడా ధీటుగా వాదనలు వినిపించారు. ‘‘ఎఫ్ఐఆర్ నమోదు ప్రాథమిక అంశం మాత్రమే. అందులో పేర్కొన్న అంశాలే అంతిమం కాదు. దర్యాప్తులో తేలే విషయాల ఆధారంగా సెక్షన్లు చేరుస్తారు. రెండు నెలల క్రితమే కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. అందుకోసం గవర్నర్ నిర్ణయానికి పంపారు. గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాతనే కేసు నమోదు చేశారు. ఫార్ములా సంస్థకు డబ్బు విదేశీ కరెన్సీలో చెల్లించారు. దీంతో హెచ్‌ఎండీఏపై అధిక భారం పడింది. ఈ చెల్లింపు కోసం ఆర్‌బీఐ అనుమతి కూడా తీసుకోలేదు. ఆర్థిక మంత్రి అనుమతి కూడా తీసుకోలేదు’’ అని ఏజీ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కేటీఆర్‌కు పదిరోజుల రిలీఫ్ అందించింది. ఈలోపు ఏసీబీ దర్యాప్తు కొనసాగించాలని తెలిపింది.