తెలంగాణ సంప్రదాయాలు నాకెంతో నచ్చాయి: మిస్ వరల్డ్ ఓపల్ సుచాత

తెలంగాణ సంప్రదాయాలు తనకు నచ్చాయని మిస్ వరల్డ్ ఓపల్ సుచాత సువాంగ్ శ్రీ చెప్పారు. ఆమె తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.;

Update: 2025-06-01 15:33 GMT
మిస్ వరల్డ్ ఓపల్ సుచాత సువాంగ్ శ్రీ

తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి తనకు నచ్చాయని మిస్ వరల్డ్ కిరీటధారిణి ఓపల్ సుచాత సువాంగ్ శ్రీ చెప్పారు. హైదరాబాద్ నగరానికి వచ్చాక హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు ఎంతో ఇష్టం ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు. బిర్యానీ తన ఫేవరెట్ డిష్ గా మారిందని సుచాత చెప్పారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ముద్దుగుమ్మలు
కొత్తగా మిస్ వరల్డ్ కిరీటం ధరించిన ఓపల్ సుచతా తన తోటి మిస్ వరల్డ్ పోటీదారులతో కలిసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ప్రపంచ సుందరీమణులు పలువురు తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మీకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ ప్రపంచ సుందరీమణులు ఆనందంతో చెప్పారు. గొప్ప వారసత్వం, శక్తివంతమైన సంస్కృతి,రాష్ట్ర అద్భుతమైన పురోగతిని సాధించిందని వారు పేర్కొన్నారు.



మాతృమూర్తిని ఆలింగనం చేసుకున్న మిస్ వరల్డ్

మిస్ వరల్డ్ -25 కిరీటాన్ని దక్కించుకున్న థాయ్ అందాల భామ ఓపల్ సుచతా తన తల్లిని ఆలింగనం చేసుకుంది. థాయ్ లాండ్ జాతీయ జెండాను చేత పట్టుకొని గర్వంతో నిండిన కళ్లతో తన కుమార్తెను హత్తుకుంది.మిరుమిట్లు గొలిపే కిరీటం, ప్రకాశవంతమైన గౌనులో మెరిసిన ఓపల్, తన తల్లి ముఖాన్ని ముద్దాడారు.



 మిస్ వరల్డ్ 2025 థాయిలాండ్ ప్రాజెక్ట్

థాయిలాండ్ దేశంలో రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడిన మహిళ సుచతా మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకొని విజయ లక్ష్యాన్ని సాధించింది. కేవలం 16 సంవత్సరాల వయసులో మిస్ వరల్డ్ థాయిలాండ్ అయిన సుచత క్యాన్సర్ బారిన పడ్డారు.ప్రాణాంతకం కాకపోయినా, భయం, అనిశ్చితి మధ్య గడిపిన సుచత బ్యూటీ విత్ ఎ పర్పస్ ప్రాజెక్ట్ ఓపల్ ఫర్ హర్ వెనుక చోదక శక్తిగా మారింది. మిస్ వరల్డ్ క్యాన్సర్ పై అవగాహన కల్పించడానికి పాడ్‌కాస్ట్‌లను ప్రారంభించడం, ఆసుపత్రుల సహకారంతో ఉచిత రొమ్ము స్క్రీనింగ్ ఈవెంట్‌లను నిర్వహించారు. క్యాన్సర్ నివారణ కోసం విరాళాలు సేకరించడంతోపాటు భవిష్యత్తులో, వైద్య విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించారు.



 తిరిగి వెళ్లి పోయిన అందాల భామలు

బోట్స్వానా, కజకిస్తాన్, మిస్ వరల్డ్ 2016, గినియా, జమైకా, కామెరూన్, బెలిజ్, కొలంబియా, జింబాబ్వే, జపాన్, ఫ్రాన్స్ దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు ఆదివారం హైదరాబాదు నుంచి వారి దేశాలకు బయలుదేరారు.తెలంగాణ సంస్కృతి, చరిత్ర, వారసత్వం, మానవతా విలువలు, ప్రజల జీవన విధానాలను ఈ అందాల పోటీలు ప్రపంచానికి చాటి చెప్పాయి.మిస్ వరల్డ్ వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రానికి అంబాసిడర్ లాగా ‘తెలంగాణ — జరూర్ ఆనా’ సందేశాన్ని ప్రపంచం నలుమూలలకూ తీసుకెళ్లారు.


Tags:    

Similar News