‘బీఆర్ఎస్‌లో కుర్చీలాట..కాంగ్రెస్‌లోకి హరీష్ రావు’

బీఆర్ఎస్ పార్టీలో హరీష్ చరీష్మా తగ్గిపోయిందని, ఆయనకు, ఆయన మాటకు ఎవరూ సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అన్నారు.;

Update: 2025-05-05 11:35 GMT

హరీష్ రావు అంటే బీఆర్ఎస్‌ పార్టీలోని అత్యంత కీలక నేతల్లో ఒకరుగానే ప్రజలు గుర్తు చేసుకుంటారు. కానీ ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రయత్నించారంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే హరీష్ రావు ఇప్పటికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఉండేవారని వ్యాఖ్యానించారు. ఇప్పటికి అయినా కాంగ్రెస్‌లోకి రావాలని అనుకుంటే ఆ అంశంపై పార్టీ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని కూడా అన్నారు ఆదిశ్రీనివాస్. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ చరీష్మా తగ్గిపోయిందని, ఆయనకు, ఆయన మాటకు ఎవరూ సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అన్నారు. ఇంకా అదే పార్టీలో కొనసాగితే మాత్రం రేపోమాపో వాళ్లే హరీష్ రావును బయటకు పంపే అవకాశాలు లేకపోలేదంటూ విమర్శలు గుప్పించారు. అనంతరం బీఆర్ఎస్‌లో కుటుంబ కలహాలు ఉన్నాయని తాము ఎప్పటి నుంచో చెప్తున్నామని గుర్తు చేశారు.

అందుకు హరీష్ రావును సోషల్ మీడియాలో కేటీఆర్ అన్‌ఫాలో కావడం నిదర్శనమన్నారు. ఆ పార్టీలో గ్రూప్ తగాదాలు తారాస్థాయికి చేరాయని, కుర్చీ పంచాయతీ నడుస్తోందని అన్నారు. కవిత, కేటీఆర్, హరీష్ రావు మధ్య సీటు కోసం గ్రూప్ గొడవలు జరుగుతున్నాయని, అవి రోజురోజుకు అధికమవుతున్నాయని అన్నారు ఆదిశ్రీనివాస్. అనంతరం కేంద్రం ప్రకటించిన బీసీ కులగణన అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ కులగణన కాంగ్రెస్ పేటెంట్ అని ఉద్ఘాటించారు.

‘‘కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ లో జరిగింది కులగణన కాదు సర్వే కాదు అంటుండు. కులగణన కు సర్వేకు తేడా ఏంటో కిషన్ రెడ్డి చెప్పాలి. ఇంగ్లీష్,తెలుగు పదానికి ఉన్న తేడా కిషన్ రెడ్డి చెప్పాలి. మేము చేసింది రాజకీయం కాదు బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతి కోసం కులగణన చేసినం. ఇప్పుడు బిజెపి పార్టీ బిసి లతో కులగణన పై మీటింగ్ లు పెట్టినా ఇప్పుడు ఉపయోగం లేదు. కులగణన చేసి తెలంగాణ దేశానికి రోల్ మోడల్. జంతర్ మంతర్ దగ్గర బిసీల ధర్నా కు BJP, BRS రాలేదు. ఏనాడు మోడీ,నడ్డా కులగణన పైన నోరు విప్పలేదు. ఇప్పటికైన కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తామనడం స్వాగతిస్తున్నాం’’ అని తెలిపారు.

‘‘రాహుల్ గాంధీ ఒత్తిడి మేరకే కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తుంది. కటాప్ తేదీ పెట్టి కులగణన జరపాలి. బడుగు బలహీన వర్గాలు కాంగ్రెస్ వైపు ఉన్నారని బీజేపీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. మేము చేసింది రాజకీయం బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతి కోసం కులగణన చేసినం. ఇప్పుడు బిజెపి పార్టీ బిసి లతో కులగణన పై మీటింగ్ లు పెట్టినా ఇప్పుడు ఉపయోగం లేదు. కులగణన చేసి తెలంగాణ దేశానికి రోల్ మోడల్. జంతర్ మంతర్ దగ్గర బిసీల ధర్నా కు BJP, BRS రాలేదు. ధర్నాకు 57పార్టీలు సంఘీ భావం తెలిపినా BRS మాత్రం స్పందించలేదు. బావ బామ్మర్దుల కేటీఆర్,హరీష్ ల కుర్చీ పంచాయతీ కి కాంగ్రెస్ కు సంబంధం లేదు. BRS లో ప్రజాస్వామ్యం లేదు. అది కాంగ్రెస్ కే సాధ్యం’’ అని అన్నారు. కులగణన బిల్లు ను బలపర్చడం బీసీ బిడ్డగా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పారు.

Tags:    

Similar News