మావోయిస్టుల హెచ్చరికలతో మంత్రులకు భద్రత పెంపు

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు.మావోల హెచ్చరికలతో ఇంటెలిజెన్స్ విభాగం అలర్ట్ అయింది.

Update: 2024-09-07 13:08 GMT

ఛత్తీస్‌ఘడ్ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోకి వచ్చిన మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటరులో ఆరుగురు సాయుధులైన మావోయిస్టులు మరణించారు. ఈ భారీ ఎన్‌కౌంటర్ అనంతరం మావోయిస్టుల జారీ చేసిన హెచ్చరికలతో తెలంగాణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం అలర్ట్ అయింది.

- మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ల భద్రతా ఏర్పాట్లను సమీక్షించాలని తెలంగాణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం నిర్ణయించింది.
- ఖమ్మం జిల్లాలో అనుమానాస్పద వ్యక్తులు, వారి కార్యకలాపాలపై పోలీసులు నిఘా ఉంచారు. ముగ్గురు మంత్రులకు సాయుధ భద్రత పెంచే విషయమై చర్యలు తీసుకోవాలని ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడారు.
- ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం భద్రాద్రి కొత్తగూడెం, ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఉండటంతో ఆయా జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ నేతలు, మంత్రులు, అధికారులకు భద్రత పెంచారు.

ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో...
ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లోని మోతే గ్రామం నీలాద్రిగుట్ట కొండ ప్రాంతంలో మావోయిస్టులకు, గ్రేహోండ్స్ కమాండోలకు మధ్య 40 నిమిషాల పాటు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు.ఛత్తీస్ ఘడ్ లో పోలీసుల నిర్బంధం పెరిగిందని అక్కడి మావోయిస్టులు ఉమ్మడి ఖమ్మం జిల్లా అడవుల్లోకి వలసవచ్చి ఎదురుకాల్పుల్లో మృత్యువాత పడ్డారు. ఇటీవల ఛత్తీస్ ఘడ్ లో జరిగిన కాల్పుల్లో 9మంది మావోయిస్టులు మరణించారు.మావోయిస్టుల మృతదేహాల వద్ద ఏకే 47,తుపాకులు, మందుగుండు సామాగ్రి, కిట్ బ్యాగులు లభించాయి.


Tags:    

Similar News