సుగాలి, లంబాడి, బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగింపుపై విచారణ
తెల్లం వెంకట్రావుపై సుప్రీం కోర్టులో విచారణ;
సుగాలీ ,లంబాడీ, బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారి చేసింది. సుగాలీ, లంబాడీ, బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చటంపై గతంలో తెలంగాణ హైకోర్టులో బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ తెల్లం వెంకట్రావు.. సుప్రీంకోర్టుకు వెళ్లారు. లంబాడీ, సుగాలీ, బంజారాలను ఎస్టీ జాబితాలో నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
లంబాడీ, సుగాలీ, బంజారాలు సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా వృద్ది చెందారని పిటీషన్‌లో తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. వారిని ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల కోయ సామాజిక వర్గానికి తీరని అన్యాయం జరుగుతోందని స్పష్టం చేశారు. శుక్రవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన బెంచ్ ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
2014లో రాజకీయాల్లోఅడుగుపెట్టిన తెల్లం వెంకట్రావ్
తెల్లం వెంకటరావు 2014లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నుంచి జగన్ నేతృత్వంలోని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తరువాత బీఆర్‌ఎస్ నుంచి 2018 శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత తెల్లం వెంకటరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో తనకు టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో ఆయన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తిరిగి బీఆర్ఎస్‌లో చేరారు.
భద్రచలం నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెల్లం వెంకట్రావ్ పోటీ చేసారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి వీరయ్యపై 5,719 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ప్రవేశించారు. తెల్లం వెంకటరావు 2024 ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జన జాతర సభలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పట్నుంచి ఆయనపై ఫిరాయింపు ఎమ్మెల్యేగా ఆయనను పరిగణిస్తున్నారు. తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని సవాల్ చేస్తూ బిఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినసంగతి తెలిసిందే. ఈ కేసులో తెల్లంవెంకట్రావ్ కు అసెంబ్లీ స్పీకర్ ఇప్పటికే నోటీసులు జారి చేసారు.