హెచ్ సీఏ అధ్యక్షుడిగా జగన్ మోహన్ రావు కి ఉద్వాసన?
వార్షిక సమావేశంలో నిర్ణయం... ఉప్పల్ స్టేడియంలో టెన్షన్ వాతావరణం;
హెచ్ సీఏ వార్షిక జనరల్ బాడీ సమావేశం ఉప్పల్ స్టేడియంలో జరుగుతోంది. ఈ
సందర్బంగా ఉప్పల్ స్టేడియం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు అరెస్టు నేపథ్యంలో ఆయనను బర్తరఫ్ చేస్తూ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ భేటీలో హెచ్‌సీఏ నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉంది. కొత్త అధ్యక్షుడి రేసులో పలువురు హెచ్‌సీఏ సభ్యులు ఉన్నారు. స్టేడియంలో జరుగుతున్న హెచ్‌సీఈ సమావేశాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ(హెచ్‌సీఏ) అడ్డుకుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద భారీగా బందోబస్తు చేపట్టారు. జగన్‌మోహన్‌రావు అరెస్టు దృష్ట్యా ఆయనను తొలగిస్తూ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ భేటీలో హెచ్‌సీఏ నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉంది. కొత్త అధ్యక్షుడి రేసులో హెచ్ సీ ఏ సభ్యులు పావులు కదుపుతున్నారు. కొత్త అధ్యక్షుడి రేసులో పలువురు హెచ్‌సీఏ సభ్యులు ఉన్నారు. అయితే.. స్టేడియంలో జరుగుతున్న హెచ్‌సీఈ సమావేశాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ (TCJAC) ప్రయత్నించింది. ఈ మేరకు కొత్తగా 300 క్రికెట్ క్లబ్‌ల ఏర్పాట్లకు అనుమతినివ్వాలని నేతలు డిమాండ్ చేశారు. దీంతో TCJAC సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో గట్టి బందోబస్తు చేపట్టారు. ఈ మేరకు కొత్తగా 300 క్రికెట్ క్లబ్‌ల ఏర్పాట్లకు ఆమోదం తెలపాలని నేతలు డిమాండ్ చేశారు. దీంతో TCJAC సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో భారీ బందోబస్తు చేపట్టారు.
173 క్లబ్బులకు మాత్రమే అనుమతి
హైద్రాబాద్ క్రికెట్ క్లబ్ అసోసియేషన్ వార్షిక సమావేశానికి 173 క్లబ్బులకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ క్లబ్బులకు చెందిన సెక్రెటరీలను మాత్రమే స్టేడియంలో అనుమతిస్తున్నారు. ఈ సమావేశంలో అంబుడ్స్ మెన్, ఎథిక్స్ ఆఫీసర్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో సస్పెండ్ చేసిన క్లబ్బులకు అనుమతి లేదని హెచ్ సీఏ యాజమాన్యం తేల్చి చెప్పింది. శ్రీ చక్ర క్లబ్బును ఇదివరకే సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ క్లబ్బు అధ్యక్షురాలిగా కవితాయాదవ్ ఆమె భర్త రాజేందర్ యాదవ్ సెక్రెటరీ పదవిలో కొనసాగుతున్నారు. వీరిద్దరు గౌలిపురా క్లబ్బు అధ్యక్షుడైన కృష్ణాయాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి శ్రీ చక్ర క్లబ్బును ఏర్పాటు చేశారు. శ్రీ చక్ర క్లబ్బు నేతృత్వంలో ఏర్పాటైన తెలంగాణక్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉప్పల్ స్టేడియం వద్ద గొడవ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
అంబుడ్స్ మెన్ గా జస్టిస్ సురేష్ కుమార్
తాజాగా వార్షిక సమావేశంలో అంబుడ్స్ మెన్ గా జస్టిస్ సురేష్ కుమార్ ఎంపికైనట్లు తెలుస్తోంది.
హెచ్ సీఏ అక్రమాలపై జరుగుతున్న విచారణలో సిఐడి స్పీడ్ పెంచింది . మల్కాజ్ గిరి కోర్టు ఆదేశం మేరకు సిఐడి ఐదుగురు నిందితులను ఆరు రోజుల పాటు కస్టడీలో తీసుకుంది. నిందితులను ఇప్పటికే ఉప్పల్ స్టేడియం కు తీసుకొచ్చి సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసింది. అక్కడ్నుంచి వివాదాస్పద గౌలిపురం స్టేడియంకు తీసుకొచ్చి మిత్ర క్లబ్బులో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు. జగన్ మోహన్ రావు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మారడానికి దారి తీసిన పరిస్థితులను సిఐడి అధికారులు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఐడి విచారణకు ఆదేశించారు. బిఆర్ఎస్ ప్రోద్బలంతో జగన్ మోహన్ రావు హెచ్ సి ఏ అధ్యక్షుడిగా నియమకమైనట్టు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపిస్తుంది. కవిత, కెటిఆర్ ప్రోద్బలంతోనే జగన్ మోహన్ రావు అధ్యక్ష పదవికి పోటీ చేసి గెలిచారని ఇటీవల తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రావు అధ్యక్షుడు అయిన తర్వాత ఏర్పాటైన సమావేశానికి కవిత, కెటిఆర్ హాజరైనట్టు అసోసియేషన్ తెలిపింది.