కాళేశ్వరం ఈఎన్సీ అవినీతి బండారం బయటపడిందిలా...
కాళేశ్వరం నిర్మాణ డిజైన్లు మార్చి లక్షల కోట్ల రూపాయలను స్వాహా చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.తాజాగా ఏసీబీ దాడుల్లో అవినీతి తిమింగలం దొరికింది.;
గజ్వేల్ లోని తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదలశాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ భూక్యా హరి రామ్ పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేసి సంపాదనకు మించిన ఆస్తులున్నాయని కేసు నమోదు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఇంజినీర్ భూక్యా హరి రూ,200 కోట్లరూపాయల ఆస్తులకు అధిపతి అని తేలింది. కాళేశ్వరం కుంభకోణంలో ఇంకెంత మంది అక్రమాలకు పాల్పడ్డారనేది తేలాల్సి ఉంది.ఎన్డీఎస్ఏ రిపోర్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలిచ్చారని పేర్కొన్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు మరింత మంది అక్రమార్కులపై దృష్టి సారించారు.
A disproportionate assets (DA) Case has been registered against "Bhookya Hari Ram, Engineer in Chief, Irrigation and CAD dept. Govt of Telangana", Gajwel by Telangana #ACB Officials.
— ACB Telangana (@TelanganaACB) April 26, 2025
ACB Officials conducted searches at his residence along with 13 places linked to him and his…
కాళేశ్వరంలో అవినీతి తిమింగలం