ఉత్తమ్‌పై అలిగిన కోమటి.. ఫోన్లు స్విచ్ ఆఫ్

Update: 2025-07-29 09:22 GMT

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అలిగారు. నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తడం కోసం ఇద్దరు మంత్రులు హాజరుకావాల్సి ఉంది. వీరితో పాటు మరో మంత్రి అడ్లూరి లక్ష్మన్ కూడా బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో వెళ్లాలి. కాగా అక్కడకు రావడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలస్యం చేశారు. టైమ్ ప్రకారం ఉదయం 9 గంటలకే బేగంపేట చేరుకున్న కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్.. ఉత్తమ్ కోసం కాసేపు ఎదురుచూశారు. ఇంతలోనే టైమ్ 10 గంటలు అయింది. అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా రాకపోవడంతో కోమటిరెడ్డికి ఆగ్రహం నషాలానికి అంటింది. ఆయన కోసం ఇంకెంత సేపు ఆగాలని మండిపడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి హెలికాప్టర్‌లో నాగార్జున సాగర్‌కు వెళ్లారు. అక్కడ సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. అయితే ఇప్పుడు అసలు హైలెట్ ఏంటంటే.. ఇటు కోమటిరెడ్డి ఫోన్, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ అయ్యాయి. దీంతో వీరి వివాదం ఎంత దూరం వెళ్తుందో అని కాంగ్రెస్ శ్రేణులు ఆలోచనలో పడ్డాయి.

Tags:    

Similar News