కొమురం భీం టైగర్ కారిడార్ జీఓ నిలిపివేత, సర్కారు ఉత్తర్వులు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గిరిజనులు, ఆదివాసీల ఆందోళనకు తెలంగాణ సర్కారు దిగివచ్చింది.;

Update: 2025-07-21 13:08 GMT

ఆదివాసీలు, గిరిజనుల ఆందోళనల తర్వాత తెలంగాణ ప్రభుత్వం జీఓ 49 ని నిలిపివేసింది.సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో గిరిజన సంఘాలు, ప్రజా ప్రతినిధులు బంద్ చేసి లేవనెత్తిన ఆందోళనలను గౌరవిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉత్తర్వు (GO 49) ని నిలుపుదల చేయాలని నిర్ణయించిందని తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.కొమురం భీం టైగర్ కారిడార్ ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర అటవీ శాఖ జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది.


గిరిజనుల ఆందోళన ఫలితంగా...
గిరిజనుల ఆందోళనల నేపథ్యంలో కొమురం భీం టైగర్ కారిడార్ ఉత్తర్వులపై రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, సీతక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించారు.తాము ఆదివాసీలు, గిరిజనులకు అండగా నిలుస్తామని రాష్ట్ర అటవీ మంత్రి కొండా సురేఖ చెప్పారు.ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, అటవీ శాఖ విడుదల చేసిన జీఓ 49 అమలును నిలిపివేయాలని అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. 

జీఓ 49 ఏం చెబుతుందంటే...
జూన్ 30వతేదీన అటవీ శాఖ జీవో 49 జారీ చేసింది. దీని లక్ష్యం కుమురంభీం - ఆసిఫాబాద్ జిల్లాలోని - ఆసిఫాబాద్, కెరమేరి, రెబ్బెన, తీర్యాణి, కాగజ్‌నగర్, సిర్పూర్, కర్జెల్లి, బెజ్జూర్ , పెంచికల్‌పేట్‌తో సహా బహుళ అటవీ శ్రేణులలోని 1.49 లక్షల హెక్టార్లను విస్తరించిన కవ్వాల్ టైగర్ కారిడార్‌లో భాగంగా కుమురంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 330 కి పైగా గ్రామాలు ప్రభావితమైనందున, గిరిజన నివాసితులు,స్థానిక ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. వేగంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం, పరిస్థితిని సమగ్రంగా పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ నుంచి అదనపు నివేదికను కోరింది.


Tags:    

Similar News