సోదరి కూతురు ప్రాణం కాపాడిన ఎమ్మెల్యే లాస్య నందిత

ఓఆర్ఆర్ పై జరిగిన కారు ప్రమాదంలో మరణించిన ఎమ్మెల్యే లాస్య నందిత, ప్రమాదం జరగడానికి కొన్ని నిమిషాలముందు.. తనతో పాటు కారులో ప్రయాణిస్తున్న తన సోదరి కూతురును..

Update: 2024-02-25 05:27 GMT

ఔటర్ రింగ్ రోడ్డుపై కారు ప్రమాదానికి గురై దుర్మరణం పాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అనుకోకుండా ఒక పసిపాప ప్రాణం కాపాడింది.


అంతకు ముందు తనతో పాటు కారులో ప్రయాణిస్తున్న 12 ఏళ్ల తన సోదరి కూతురును వేరే కారులోకి మార్చినట్లు తెలిసింది. ఇది ప్రమాదం జరగడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు జరిగినట్లు సంగారెడ్డి పోలీసులు వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం" ఎమ్మెల్యే లాస్య తన తల్లికి కాల్ చేసి కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఆగమంది. సిటీలో పొద్దున్నే టిఫిన్లు దొరకవని, అందువల్ల ఔటర్ రింగ్ రోడ్డుపై సదాశివపేట్ రోడ్ పైపు టిఫిన్లు ఉంటాయని చెప్పింది. నేను తిని, మిగిలిన ఫ్యామిలికి తీసుకొస్తానని కాల్ చేసి చెప్పింది. పాపను మీ కారులోకి తీసుకోమని కోరింది. దాంతో వేరే కారులో ప్రయాణిస్తున్న తన తల్లి, సోదరి కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఆగి పాపను తమ కారులోకి తీసుకున్నారు. దీని ప్రకారం పాప ప్రమాదం నుంచి ఎస్కేప్ అయింది.


 దీనిమీద టైమ్స్ ఆఫ్ ఇండియా లో వచ్చిన ఒక కథనం ప్రకారం ఇది జరిగిన కేవలం కొన్ని నిమిషాలకే ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళ్లి సుల్తాన్ పూర్ వద్ద రెయిలింగ్ ను ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న యువ ఎమ్మెల్యే అక్కడికక్కడే దుర్మరణం చెందింది. కారులో ఆమెతో పాటు వ్యక్తిగత సహాయకుడు, డ్రైవర్ అయిన ఆకాష్ ఉన్నాడు. అతడు కూడా ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.

మొదటగా డ్రైవింగ్ ఆకాష్, బాలానగర్ మీదుగా బోయిన్ పల్లి చేరుకున్నాడు. తరువాత హకీంపేట్ రోడ్ మీదుగా ప్రయాణించి, షామీర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు కు చేరుకున్నాడు. అక్కడి నుంచి వేగంగా కారు నడిపి సుల్తాన్ పూర్ రీచ్ అయ్యాడు. అక్కడే ఓవర్ స్పీడ్ కారణంగా రెయిలింగ్ ను ఢీ కొట్టాడు. ప్రమాదం జరిగిన స్థలంలోనే లాస్య మృతి చెందింది. ఆకాష్ మాత్రం గాయాలతో బయటపడ్డాడని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఎమ్మెల్యే నందిత, తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి సదాశివ్ పేట మండలంలోని ఆరూర్ గ్రామంలో గల దర్గాకు వెళ్లినట్లు పటాన్ చెరు పోలీసులు వెల్లడించారు. " నందిత తండ్రి దివంగత ఎమ్మెల్యే సాయన్న గత సంవత్సరం ఫిబ్రవరిలో మరణించాడు. అప్పటి నుంచి కుటుంబం వరుస ప్రమాదాలను ఎదుర్కొంటుంది. అయితే అన్ని ప్రమాదాల నుంచి కుటుంబ సభ్యులు ఎస్కేప్ అవుతూ వస్తున్నారు. వీటిని నుంచి రక్షించుకోవాలనే ఉద్దేశ్యంతో దర్గాకు వెళ్లారు. ప్రార్థనలు చేశాక శుక్రవారం ఉదయం కార్ఖానాలో ఉన్న తమ ఇంటికి బయల్దేరారు. అదే నందితకు చివరి ప్రయాణం గా మారింది.


Tags:    

Similar News