మరో వివాదంలో మంచు ఫ్యామిలీ.. అడవి పందిని వేటాడి..

మంచు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది. కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన మంచు ఫ్యామిలీ ఇప్పుడు మరో వివాదంతో వార్తల్లో నిలుస్తోంది.;

Update: 2024-12-31 07:25 GMT

మంచు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది. కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన మంచు ఫ్యామిలీ ఇప్పుడు మరో వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. మంచు కుటుంబంలో రాజుకున్న మంటలు చల్లారాయి అనుకునే లోపే మరోసారి వార్తల్లో నిలిచింది ఈ కుటుంబం. అడవి పందిని వేటాడిన విషయంలో మంచు విష్ణు సిబ్బందిపై నెటిజన్లు మండిపడుతున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. జల్‌పల్లిలోని అడవిలో మంచు విష్ణు మేనేజర్ కిరణ్ తన అనుచరులతో కలిసి వేటాడారు. కిరణ్, ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ కలిసి ఓ అడవి పందిని వేటాడారు. అనంతరం దాన్ని ఓ కర్రకు కట్టుకుని మోసుకుని వస్తున్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవోతంది. ఇది చూసిన నెటిజన్లు వారిపై మండిపడుతున్నారు. అడవి జంతువులను వేటాడటం చట్టవిరుద్దమని వారికి తెలియదా? తెలిసినా చట్టం ఏం చేస్తుందన్న అహంకారామా? వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాం. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌ల వెల్లువెత్తిస్తున్నారు. మరి దీనిపై మంచు ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మంచు కుటుంబానికి మరో తలనొప్పి

ఇప్పటికే మంచు కుటుంబ కథా చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జర్నలిస్ట్‌పై దాడి చేసిన కేసు విషయంలో మోహన్ బాబును ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అర్థం కాని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల దుబాయ్‌కి వెళ్లి తిరిగి వచ్చానని, తాను తిరుపతిలో ఉన్నాని చెప్పిన మోహన్ బాబు ఇప్పటి వరకు మళ్ళీ యాక్టివ్ కాలేదు. తిరుపతిలోనే ఉంటూ మౌనం పాటిస్తున్నారు. ఇంతలో మంచు విష్ణు సిబ్బంది అడవి పందిని వేటాడి తీసుకురావడం, ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో.. ఈ వ్యవహారం వారికి ఎంత పెద్ద తలనొప్పి కానుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

మండిపడుతున్న జంతు ప్రేమికులు

ఈ విషయం తెలియడంతోనే జంతుప్రేమికులు అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతున్నారు. అసలు అడవి జంతువులను వేటాడే హక్కు మంచు విష్ణు సిబ్బందికి ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. అడవి జంతువులను వేటాడం భారతదేశంలో చట్టవిరుద్ధమని వారికి తెలియదా? ఎవరి కోరిక మేరకు వారు ఈ వేటకు వెళ్లారు. ఎవరి అనుమతి తీసుకున్నారు? వారు చేసింది ముమ్మాటికీ తీవ్ర నేరమేనని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో తాము రొడ్డెక్కుతామని హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News