మంత్రి వివేక్ కు తప్పిన ముప్పు
ప్రమాదానికి కారణం ఇదే;
By : B Srinivasa Chary
Update: 2025-07-17 09:02 GMT
రాష్ట్ర కార్మిక మంత్రి వినోద్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మెదక్ జిల్లా నర్సాపూర్ కు మంత్రి కాన్వాయ్ రాగానే వివేక్ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ముందు వెళుతున్న కారు సడెన్ బ్రేక్ వేయడంతో వెనక నుంచి వస్తున్న నాలుగు కార్లు ఒకదాని తర్వాత ఒకటి ఢీ కొన్నాయి. మంత్రి కూర్చున్న కారు కూడా ఢీకొన్న కార్లలో ఉంది.
దీంతో మంత్రి వివేక్ వెంకటస్వామికి పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.