ఘనంగా ముత్యాలమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠ..

సికింద్రాబాద్ మొండా మార్కెట్ దగ్గర ముత్యాలమ్మ ఆలయంపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. దేవతావిగ్రహాన్ని కాలితో తన్నడం తీవ్ర దుమారం రేపింది.

Update: 2024-12-11 09:15 GMT

సికింద్రాబాద్ మొండా మార్కెట్ దగ్గర ముత్యాలమ్మ ఆలయంపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. దేవతావిగ్రహాన్ని కాలితో తన్నడం తీవ్ర దుమారం రేపింది. వెంటనే ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. తాజాగా ఆ ఆలయంలో అమ్మవారి నూతన విగ్రహాన్ని ప్రష్ఠించడం జరిగింది. ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, మంత్రి కొండా సురేఖ, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సహా పలువురు పాల్గొన్నారు. విగ్రహ పునఃప్రతిష్ఠ సందర్భంగా వారంతా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠపై స్థానికులు, అర్చకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ నిందితుడిని ఊరికినే వదలకూడదని, కఠిన చర్యలు తీసుకోవాలని, అతడిపై తీసుకునే చర్యలు మరోసారి ఇలా చేయాలంటే ఎవరైనా ఆలోచించుకునేలా, ఒక గుణపాఠంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు. ఈరోజు విగ్రహ పునఃప్రతిష్ఠ సందర్భంగా మంత్రి పొన్నం ప్రకార్ మాట్లాడారు. విగ్రహ పునఃప్రతిష్ఠించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

‘‘గతంలో జరిగిన ఘటన దురదృష్టకరమే. ఘటన జరిగిన వెంటనే స్పందించిన ప్రభుత్వం స్థానికు ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నూతన విగ్రహాన్ని సిద్ధం చేసింది. తాజాగా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాం. అమ్మవారి ఆశీస్సులు పొందే విధంగా పండితులు వేందమంత్రాలు ఉచ్చఱిస్తుండగా విగ్రహాన్ని ప్రతిష్ఠించాం’’అని తెలిపారు. అంతేకాకుండా ఎక్కడైనా ప్రార్థనా మందిరాలు, దేవాలయాలపై రాజకీయాలు చేయడం ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. ఆ ముత్యాలమ్మకు రెండు చేతులు జోడించి ప్రజలంతా తమ సుఖదుఃఖాలను పంచుకుంటారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని దేవాలయాలను కాపాడుకోవాలని, విద్రహోం జరిగిన సమయంలో అందరం ఏకమత్యంతో ఎదుర్కోవాలే కానీ రాజకీయాలు చేయడం సరైన పద్దతి కాదు’’ అని ఆయన వివరించారు.

Tags:    

Similar News