72వ మిస్ వరల్డ్-25 థాయ్ లాండ్ సుందరి ఓపల్ సుచాత
72 వ మిస్ వరల్డ్ పోటీల్లో అందాల సుందరి కిరీటం థాయ్ లాండ్ దేశ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ శ్రీకి దక్కింది.;
72 వ మిస్ వరల్డ్ పోటీల్లో అందాల సుందరి కిరీటం థాయ్ లాండ్ దేశ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ శ్రీకి దక్కింది.1వ రన్నరప్ గా మిస్ ఇథియోపియో, 2వ రన్నర్ అప్ గా మిస్ పోలెండ్, 3వ రన్నరప్ గా మార్టినిక్ నిలిచారు. తెలంగాణ ఆతిథ్యం ఇచ్చిన మిస్ వరల్డ్ 72 విజేతగా థాయిలాండ్ కు చెందిన సుందరీమణి ఎంపికయ్యారు. మిస్ వరల్డ్ కిరీటాన్ని థాయ్ లాండ్ సుందరికి సీఎం రేవంత్ రెడ్డి, జూలియా మోర్లీ ల సమక్షంలో క్రిస్టినా పిజ్కోవా అలంకరించారు.
హైటెక్స్ వేదికగా 72వ మిస్ వరల్డ్ ఫైనల్స్ (Miss World Grand Finale) కార్యక్రమం శనివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 108మంది అందాలభామలు ఈ పోటీల్లో పాల్గొన్నారు.ఖండాల వారీగా టాప్ ఇద్దరి నుంచి ఒక్కరిని షార్ట్ లిస్ట్ చేశారు. నువ్వు మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తావు అని అడిగిన ప్రశ్నకు 45 సెకన్లలో మెరుగైన సమాధానం ఇచ్చిన వారిని ఎంపిక చేశారు. అభ్యర్థుల సమాధానాలకు జడ్జీలు మార్కులు వేశారు. అమెరికా నుంచి బ్రెజిల్, మార్టినిక్,ఆఫ్రికా నుంచి ఇథియోపియా, నమీబియా,యూరప్ నుంచి పోలెండ్,ఉక్రెయిన్,ఆసియా నుంచి ఫిలిప్పీన్స్,థాయిలాండ్ లు టాప్ లో నిలిచారు.అద్భుతమైన డ్రెస్ తో హర్షధ్వానాల మధ్య 71 మిస్ వరల్డ్ చెక్ రిపబ్లిక్ కు చెందిన క్రిస్టినా పిజ్కోవా స్టేజ్ పైన ప్రత్యక్షమయ్యారు.