చిక్కుల్లో యూట్యూబర్ హర్షసాయి.. లుక్‌ఔట్ నోటీసులు జారీ..

లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ యూట్యూబర్ హర్షసాయికి చుక్కెదురైంది. అతని ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కోట్టేసింది.

Update: 2024-10-05 12:16 GMT

లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ యూట్యూబర్ హర్షసాయికి చుక్కెదురైంది. అతని ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కోట్టేసింది. హైకోర్టు నుంచి ఇటువంటి షాక్‌ను ఎక్స్‌పెక్ట్ చేయని హర్షసాయి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కోర్టు తీర్పుతో ఈ కేసు కీలక మలుపు తీసుకుంది. హర్షసాయి కోసం పోలీసులు తమ గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశారు. అంతేకాకుండా లుకౌట్ నోటీసులను కూడా పోలీసులు జారీ చేశారు. నార్సింగి పోలీసులు జారీ చేసిన లుకౌట్ నోటీసులతో హర్షసాయి చిక్కుల్లో పడినట్లయింది. అతనిపై నమోదైన అత్యాచారం కేసు ఇప్పుడు మరింత బలపడినట్లు తెలుస్తోంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, పైగా నగ్న చిత్రాలు తీసుకుని ఇప్పుడు బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడంటూ బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రైమ్‌లో హర్హసాయి తండ్రి రాధాకృష్ణ పేరు కూడా నమోదై ఉంది. అతను కూడా ముందుగా ఇద్దరికీ పెళ్ళి చేస్తామని చెప్పి.. ఇప్పుడు మాట దాట వేస్తున్నారంటూ బాధితురాలు తన ఫిర్యాదులో వివరించారు.

హర్షసాయి కోసం స్పెషల్ టీమ్స్

ఈ కేసు నమోదైన రోజు నుంచి హర్ష సాయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని జాడ తెలుసుకోవడం కోసం నార్సింగి పోలీసులు తెగ శ్రమిస్తున్నారు. పలు స్పెషల్ టీమ్స్‌తో గాలింపులు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే హర్షసాయి బాధితుల నుంచి ఫిర్యాదులు తెగ వస్తున్నాయని, హర్షసాయి హెల్పింగ్ టీమ్ పేరిట తనను మోసం చేశారంటూ తాజాగా ఓ బాధితుడు నార్సింగి పోలీసులను ఆశ్రయించడం.. గాలింపుల్లో వేగాన్ని మరింత అధికం చేశారు పోలీసులు. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని గ్రహించి.. అటువైపు కూడా గాలింపులు చేస్తున్నారు. ఇంతలో హర్షసాయి బాధితురాలు మరో ఫిర్యాదు చేసింది.

వారందరిపై యాక్షన్ తీసుకోండి: హర్ష బాధితురాలు

సోషల్ మీడియాలో తన ఫొటోలు పెట్టి హర్షసాయి అనుచరులు తీవ్రంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అదే విధంగా మరికొందరు అత్యంత దారుణమైన పోస్ట్‌లు కూడా పెడుతున్నారని, వారందరిపై చర్యలు తీసుకోవాలని తన తాజాగా ఫిర్యాదులో కోరింది హర్షసాయి సాయి బాధితురాలు. తనను ఉద్దేశపూర్వకంగా కావాలినే ట్రోల్ చేస్తున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో తనకు మానసికంగా మరింత కుంగదీయడానికే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేసిందామే. ఈ ఫిర్యాదుపై కూడా చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News