ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఆగంతకుడి చొరబాటు..
సీసీ కెమెరా వైర్లను కత్తిరించి సుమారు గంటసేపు ఇంట్లోనే తిరగినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎవరూ గమనించకుండా జారుకున్నాడు.;
బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడ్డాడు. ఈ అంశంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఆగంతుకుడిని గుర్తించే పేనిలో పడ్డారు అధికారులు. ఈ విషయం తెలియడంతో ఎంపీకి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. సీఎం ఆదేశాల మేరలకు ఈ అంశంపై సీపీ సీవీ ఆనంద్ రంగంలోకి దిగారు. ఎంపీ నివాసానికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. దర్యాప్తుకు సంబంధించి అప్‌డేట్ తీసుకున్నారు. ఆయనతో పాటు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, జూబ్లీ హిల్స్ ఏసీబీ వెంకట్‌రెడ్డి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ డీకే అరుణకు భద్ర కల్పించారు అదికారులు. ఈ భద్రతకు సంబంధించిన వివరాలను పోలీసులు షేర్ చేరసుకున్నారు.
అయితే ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 56లోని డీకే అరుణ నివాసంలోకి ముసుగుధరించి ఉన్న ఓ వ్యక్తి చొరబడ్డాడు. సీసీ కెమెరా వైర్లను కత్తిరించి సుమారు గంటసేపు ఇంట్లోనే తిరగినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎవరూ గమనించకుండా జారుకున్నాడు. డీకే అరుణ ఉదయం నిద్రలేచే సమయానికి ఇళ్లంతా గందరగోళంగా ఉండటం, కిటికీ గ్రిల్ తెరిచి ఉండటాన్ని గమనించారు. దీంతో ఎంపీ డ్రైవర్ లక్ష్మణ్ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీ కెమెరా రికార్డింగ్ ద్వారా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎంపీ నివాసంలో పనిచేసిన వారే అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.