నీతి ఆయోగ్ విభాగం ఎంపిక చేసిన నార్నూర్, కలెక్టరుకు ప్రధాని అవార్డ్
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల బ్లాక్ అభివృద్ధి పనుల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. నీతి ఆయోగ్ విభాగం నార్నూర్ మండలాన్ని ఎంపిక చేసింది.;
అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ లోని నార్నూర్ మండలం పేరు నేడు జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. దేశంలో అయిదు ఉత్తమ బ్లాక్ లలో నార్నూర్ ఒకటిగా నీతి ఆయోగ్ ఎంపిక చేసింది. నార్నూర్ మండల అభివృద్ధికి గాను గుర్తింపుగా సాక్షాత్తూ దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సోమవారం రాత్రి ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కు అవార్డును ప్రదానం చేశారు.
నార్నూర్ మండలంలో ఏం చేశారంటే...
ప్రధాని నుంచి అవార్డు అందుకున్న కలెక్టర్
ఏప్రిల్ 21 సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా సోమవారం ఢిల్లీలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోది గారి చేతుల మీదుగా #PMAwards అవార్డు అందుకున్న అదిలాబాద్ జిల్లా పాలనాధికారి రాజర్షి షా.జిల్లా అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమంలో భాగంగా నార్నూర్ బ్లాక్ అస్పరెషనల్ ప్రోగ్రాం 2024 కు గాను జిల్లా… pic.twitter.com/0mlOpFt7F8
— Collector Adilabad (@Collector_ADB) April 21, 2025
ఉత్తమ మండలంగా నార్నూర్