బీజేపీని వదిలి రాజాసింగ్ ఉండలేకపోతున్నారా ?

రాజాసింగ్ కూడా బీజేపీలో తప్ప వేరేపార్టీలో ఇమడలేరు;

Update: 2025-07-29 11:44 GMT
BJP MLA Rajasingh

కొంతమంది నేతలంతే ఏవో కారణాలతో పార్టీకి రాజీనామా చేసినా మనసంతా ఇంకా పార్టీలోనే ఉంటుంది. ఇపుడీ విషయం ఎందుకంటే బీజేపీ గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ గురించే. పార్టీకి రాజాసింగ్(BJP MLA Raja Singh) చేసిన రాజీనామాను పార్టీ జాతీయ నాయకత్వం వెంటనే ఆమోదించిన సంగతి తెలిసిందే. జాతీయ నాయకత్వం అయితే రాజాసింగ్ ను వదిలించుకున్నది కాని రాజాసింగ్ మాత్రం పార్టీని వదల్లేకపోతున్నారు. విషయం ఏమిటంటే ఈరోజు మీడియాతో మాట్లాడుతు తనతో కేంద్రమంత్రులు కొందరు రెగ్యులర్ టచ్ లో ఉన్నట్లు చెప్పారు.

పార్టీ అగ్రనేతలను కలవాలని తాను అపాయిట్మెంట్ అడిగాననే అర్ధం వచ్చేట్లుగా ఎంఎల్ఏ చెప్పారు. పార్టీకి ఒక దణ్ణం అంటు రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ అదేపార్టీ కేంద్రమంత్రులు, కీలక నేతలతో టచ్ లో ఉండాల్సిన అవసరం రాజాసింగ్ కు ఏముంది ? ఏముందంటే రాజాసింగ్ ను బీజేపీ(Telangana BJP) తప్ప మరో పార్టీ భరించలేందు. అలాగే రాజాసింగ్ కూడా బీజేపీలో తప్ప వేరేపార్టీలో ఇమడలేరు. అందుకనే ఆవేశంలో పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తీరిగ్గా పశ్చాత్తాప పడుంటారు. అందుకనే పార్టీలోని కొందరు నేతల ద్వారా మళ్ళీ సయోధ్యకోసం ప్రయత్నిస్తున్నట్లున్నారు. ‘‘బీజేపీ చాలామందికి ఒక పార్టీయేమో కాని తనకు మాత్రం సొంత ఇల్లులాంటిద’’ని రాజాసింగ్ కామెంట్ చేయటం గమనార్హం.

తొందరలోనే రాజాసింగ్ కు పార్టీ పెద్దల నుండి పిలుపు వస్తుందని వెంటనే ఢిల్లీకి వెళ్ళి సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటారని సమాచారం. ఇదే విషయాన్ని ఎంఎల్ఏ కూడా చెప్పారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం తనను గుర్తించకపోయినా జాతీయ నాయకత్వంలో తనను గుర్తించేవాళ్ళు చాలామందే ఉన్నారని చేసిన వ్యాఖ్యలకు అర్ధం ఏమిటి ? తాను పార్టీ తరపున ఇతర రాష్ట్రాల్లో ప్రచారంచేస్తే బీజేపీకి ఓటుబ్యాంకు బాగా పెరుగుతుందన్నారు.

తాను పార్టీకి రాజీనామా చేసినా తాను బీజేపీ ఎంఎల్ఏనే అని సాంకేతిక భాషలో చెప్పారు. మూడున్నరేళ్ళు గోషామహల్(Gosha Mahal) ఎంఎల్ఏగానే కంటిన్యు అవుతానన్నారు. రాజాసింగ్ తాజా మాటలు విన్నతర్వాత ఢిల్లీ పెద్దల నుండి కబురు రాగానే తిరిగి బీజేపీలో చేరటానికి రాజాసింగ్ రెడీగా ఉన్నట్లు అర్ధమైపోతోంది. మరా ఘడియ ఎప్పుడు వస్తుందో ఏమో చూడాలి.

Tags:    

Similar News