Revanth|హాఫ్ సెంచిరీ దాటిన రేవంత్ రెడ్డి
20 నెలల పాలనలో సుమారు 5 నెలలు హైదరాబాద్ బయటే గడిపారని;
హాఫ్ సెంచిరీ అన్నది క్రికెట్(Cricket) లో చాలా పాపులర్. హాఫ్ సెంచిరీ దాటాడు అంటే బ్యాట్స్ మెన్ బాగా అడుతున్నాడనే అనుకుంటారు. ఇపుడు ఈ ప్రస్తావన ఎందుకంటే ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) కూడా హాఫ్ సెంచిరీ(Half Century) దాటాడు. రేవంత్ ఏమిటి హాఫ్ సెంచిరీ దాటడం ఏమిటని అనుకుంటున్నారు. అదేనండి శుక్రవారం రాత్రి రేవంత్ ఢిల్లీ(Delhi)కి వెళ్ళాడు. తాజా రేవంత్ ఢిల్లీ పర్యటన 51వది. గతంలో 50సార్లు ఢిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రి ఏమి సాదించాడని అడిగేందుకు లేదు. ఎందుకంటే ఎన్నిసార్లు కేంద్రమంత్రులను, నరేంద్రమోదీ(Narendra Modi)ని కలిసినా తెలంగాణ(Telangana)కు ఏమీ ఇవ్వటంలేదని రేవంతే స్వయంగా చెప్పాడు. కాబట్టి రేవంత్ ఢిల్లీ పర్యటనల వల్ల తెలంగాణకు వచ్చింది శూన్యమనే అనుకోవాలి. ఏమీ ఇవ్వరని తెలిసినా మరెందుకు ఢిల్లీకి వెళుతున్నట్లు ?
ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళి కలిసి అడిగితేనే పెద్దలు ఏమీ ఇవ్వటంలేదు. అలాంటిది అసలు వెళ్ళకపోతే వచ్చి అడగలేదు కాబట్టే ఇవ్వలేదనే నెపాన్ని రేవంత్ మీదకు తోసేయరా ? అందుకనే ఢిల్లీకి వెళ్ళి కలిసి లేదనిపించుకుంటున్నాడు. అయితే ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి తెలంగాణకు ఏదో సాధిద్దామనే ప్రయత్నేమేనా అనుకుంటే తప్పు. కొన్నిసార్లు పార్టీ పెద్దలను కలవటం కూడా ఉంది. కొన్నిసార్లు ముఖ్యమంత్రిహోదాలో కేంద్రమంత్రులు, ప్రధానిని కలిశాడు. మరికొన్నిసార్లు పార్టీ ముఖ్యమంత్రి హోదాలో ఏఐసీసీలోని అగ్రనేతలతో భేటీ అయ్యాడు. ఎలాగచూసుకున్నా రేవంత్ ఢిల్లీపర్యటనలు అయితే హాఫ్ సెంచిరీ దాటిందనే చెప్పాలి. ఎందుకంటే ఢిల్లీకి ఎందుకోసమైనా వెళ్ళచ్చు ప్రయాణఖర్చులు, బస, వసతి తదితరఖర్చులన్నీ ఖర్చులన్నీ భరించాల్సింది తెలంగాణ ప్రజలే కదా.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న 20 నెలల్లో రేవంత్ 50సార్లు ఢిల్లీకి వెళ్ళినా సాధించింది ఏమీలేదంటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు చాలాసార్లు ఆరోపణలు చేయటమే కాకుండా ఎద్దేవా కూడా చేశారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా, ఎద్దేవా చేసినా రేవంత్ కు ఢిల్లీకి అయితే వెళ్ళక తప్పదు. బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయపార్టీల అధినేత కేసీఆర్ లాంటి వాళ్ళు ఇష్టముంటే ఢిల్లీకి వెళతారు లేకపోతే లేదు. కాని కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయపార్టీలకు ప్రతిదానికి ఢిల్లీకి వెళ్ళక తప్పదు. ఎందుకంటే కేంద్రప్రభుత్వంలోని పెద్దలను కలవాలన్నా లేకపోతే పార్టీ అగ్రనేతలను కలవాలన్నా వెళ్ళాల్సింది ఢిల్లీకే కదా.
50 TRIPS – ZERO RESULTS !
— KTR (@KTRBRS) August 2, 2025
హస్తిన యాత్రలో అర్ధశతకం సాధించిన రేవంత్!
తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్‌తో కాకుండా...✈️ ఫ్లైట్ బుకింగ్స్‌తో నడిపిస్తున్న రేవంత్ రెడ్డి..
ఈయన ఢిల్లీ యాత్రలకు .. తెలంగాణకు ఏ సంబంధం లేదు.
కాంగ్రెస్ పాలన చేపట్టాక రేవంత్ చేసిన మూడు పనులు:
మొదటి పని –… https://t.co/FaCLYRgY0n
ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి మినిమం రెండు రోజులు రేవంత్ బసచేస్తున్నారు. అలాగే ఎన్నికల సమయంలో ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, కేరళకు కూడా వెళ్ళాడు. పనిలోపనిగా పెట్టుబడుల ఆకర్షణ పేరుతో దావోస్, ధక్షిణ కొరియా, అమెరికా, ఇంగ్లాండ్, జపాన్, సింగపూర్ దేశాల్లో కూడా పర్యటించాడు. ఈ విధంగా 20 నెలల్లో హైదరాబాద్ బయట అంటే ఢిల్లీ, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో గడిపింది సుమారు 150 రోజులుంటుంది. 150 రోజులంటే సుమారు 5 నెలలని లెక్క. దీన్నిబట్టి అర్ధమవుతున్నది ఏమిటంటే 20 నెలల పాలనలో సుమారు 5 నెలలు హైదరాబాద్ బయటే గడిపారని.