మణుగూరులో 144 సెక్షన్

గుంపులు గుంపులుగా తిరిగితే అరెస్ట్ చేస్తామన్న జిల్లా పోలీసులు

Update: 2025-11-02 12:19 GMT
మణుగూరులో మోహరించిన పోలీసులు

భధ్రాది కొత్తగూడెం జిల్లా మణుగూరు బిఆర్ఎస్ కార్యాలయంపై దాడి నేపథ్యంలో పట్టణంలో 144 సెక్షన్ అమలవుతోంది. బిఆర్ఎస్ , కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బిఆర్ఎస్ కార్యకర్తలపై  కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని బిఆర్ఎస్ ఇప్పటికే ఆరోపించింది. బిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలపై ప్రతి దాడికి పాల్పడే అవకాశం ఉండటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఉద్రిక్తత వాతావరణం చల్లబరిచే ప్రయత్నం చేస్తున్నారు.  మణుగూరులో144 సెక్షన్ అమలవుతోందని జిల్లాపోలీసు యంత్రాంగం తెలిపింది. 144 సెక్షన్ అమల్లోకి రావడంతో నలుగురికి మించి ఎక్కడైనా గుమిగూడితే  అరెస్ట్ చేస్తామని మణుగూరు డి ఎస్ పి రవీందర్ రెడ్డి హెచ్చరించారు.


ఆదివారం బిఆర్ఎస్ కార్యాలయాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన నేపథ్యంలో బిఆర్ఎస్ శ్రేణులు మణుగూరులో ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్ , బిఆర్ ఎస్ కార్యకర్తలు మణుగూరులో ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరువర్గాలను సముదాయించి అక్కడి నుంచి పంపించి వేశారు.

Tags:    

Similar News