‘ఫోన్ ట్యాప్ చేయాల్సిన ఖర్మ రేవంత్‌కు లేదు’

ట్యాపింగ్ చేసిన వారు, దాని వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు ఎవరో బయటపెట్టాలి.;

Update: 2025-07-24 09:36 GMT

‘ప్రతిపక్ష నాయకులు, కొందరు మంత్రుల ఫోన్లను సీఎం రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారు. ప్రతిపక్ష నేతల అందరి ఫోన్ కాల్స్‌ను వింటున్నారు’ అని బీఆర్ఎస్ నేతలు కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఫోన్ ట్యాప్ చేస్తూనే ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు కూడా బనాయిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి గానీ, తమ సీఎంకు గానీ లేదని చెప్పారు. ఒకరి ఫోన్ ట్యాప్ చేసి గెలవాల్సిన ఖర్మ తమ నేత, సీఎం రేవంత్‌కు పట్టలేదని సంచలన వ్యాఖ్యలు చేరశారు. రేవంత్ చాలా సమర్థవంతమైన నాయకుడని పేర్కొన్నారు. కాంగ్రెస్ అనేది ప్రజాస్వామ్యానికి ప్రతిరూపం లాంటి పార్టీ అని అన్నారు శ్రీనివాస్.

‘‘ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో బీఆర్ఎస్‌ నేతల తీరే ‘దొంగే దొంగ అన్నట్టు’ ఉంది. మా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వం నేరుగా సమస్యలను ఎదుర్కొనేలా ఉంటుంది. ఆయన ఎవరి ఫోన్‌లనైనా ట్యాప్ చేయాల్సిన అవసరం ఉండదు. ట్యాపింగ్ చేసిన వారు, దాని వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు ఎవరో బయటపెట్టాలి. న్యాయ ప్రక్రియ ఎవరినైనా వదలదు. కానూను ఎవరి పేరుకు కాదు. బాధ్యులు ఎవరో బయటపెట్టి శిక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని అన్నారు.

అయితే ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్.. ఫోన్ ట్యాపింగ్‌పై స్పందిస్తూ.. సిట్ పిలిస్తే విచారణకు వస్తానని చెప్పారు. ఇప్పటి వరకు తన ఫోన్ ట్యాప్ కాలేదనే భావిస్తున్నానని, ఒకవేళ తనకు సిట్ నుంచి నోటీసులు వస్తే మాత్రం తప్పకుండా విచారణకు హాజరై వాంగ్మూలం రికార్డ్ చేస్తానని చెప్పారు.

Tags:    

Similar News