ఫుట్ బాల్ ఆడేస్తున్న రేవంత్
మెస్సీ రాకసందర్భంగా ఉప్పల్ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగబోతోంది.
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఏమిటి ఫుట్ బాల్ ప్రాక్టీసు చేయటం ఏమిటని అనుకుంటున్నారా ? అవును, మీరు చదివింది నిజమే. ముఖ్యమంత్రిగా ఎంతో బిజీగా ఉంటున్న రేవంత్(Revanth) ఆదివారం అర్ధరాత్రి ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేశాడు. స్ధానికంగా ఉండే ఫుట్ బాల్(Football) ఆటగాళ్ళతో కలిసి ఎల్బీ స్టేడియంలో దాదాపు గంటసేపటికి పైగా రేవంత్ ప్రాక్టీస్ చేయటం ఆశ్చర్యమనే చెప్పాలి. ఒకవైపు రోజువారి ఊపిరి సలపని షెడ్యూల్. మరోవైపు ఈనెల 8, 9 తేదీల్లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047’ (Telangana Rising)సన్నాహక సమావేశాలతో బిజీ. ఆదివారం ఉదయం నుండి రేవంత్ రకరకాల సమీక్షలు, సమావేశాలు, మీడియా సమావేశాలతో ఫుల్లు బిజీగానే ఉన్నాడు.
అయితే మాత్రమేమి రాత్రికి అన్నింటిని ముగించుకుని జెర్సీ వేసుకుని 11 గంటల ప్రాంతంలో ఎల్బీ స్టేడియంకు చేరుకున్నాడు. స్ధానికంగా ఉండే ఆటగాళ్ళతో కలిసి దాదాపు గంటసేపు పుట్ బాల్ ప్రాక్టీస్ చేశాడు. ఎందుకీ ప్రాక్టీస్ అని అనుకుంటున్నారా ? ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజాల్లో ఒకడైన అర్జెంటీనా ఆటగాడు లయొనెల్ మెస్సీ ఈనెల 13వ తేదీన హైదరాబాద్ వస్తున్న విషయం తెలిసిందే. మెస్సీ రాకసందర్భంగా ఉప్పల్ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగబోతోంది. మెస్సీని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకునే ఉద్దేశ్యంలో రేవంత్ ప్రభుత్వం ఉంది.
వివిధ కార్యక్రమాలతో మెస్సీ ఇండియాలోని కోల్ కత్తా, ముంబై, ఢిల్లీకి వస్తున్నాడు. అందుకనే తనతో మాట్లాడి హైదరాబాద్ రావటానికి రేవంత్ ప్రభుత్వం ఒప్పించింది. ఎలాగూ వస్తున్నాడు కాబట్టి 13వ తేదీన ఎగ్జిబిషన్ మ్యాచ్ ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మ్యాచ్ లో మెస్సీ11 కి రేవంత్ 11కి మధ్య మ్యాచ్ జరగబోతోంది. మెస్సీ 11లో ఎవరెవరు ఆడుతారన్న విషయం గోప్యంగా ఉంది. రేవంత్ 11లో అయితే రేవంత్ కెప్టెన్ గా స్ధానిక ఆటగాళ్ళే ఉంటారనటంలో సందేహంలేదు.
రేవంత్ స్వతహాగా మంచి ఫుట్ బాల్ ప్లేయర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. రేవంత్ ఏస్ధాయి ఆటగాడన్న విషయాన్ని పక్కనపెట్టేస్తే ఫుట్ బాల్ పైన రేవంత్ కు మంచిపట్టుందన్నది వాస్తవం. ఈవిషయం గతంలో అనేకసార్లు నిరూపితమైంది. మెస్సీ 11తో మ్యాచ్ సరదగానే జరగబోతున్నా రేవంత్ మాత్రం చాలా సీరియస్ గానే ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. అందుకనే ఆదివారం అర్ధరాత్రి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. 10వ నెంబర్ జెర్సీతో మెస్సీ, 9వ నెంబర్ జెర్సీతో రేవంత్ మ్చాచ్ లోకి దిగబోతున్నారు. ఆరోజు మ్యాచ్ ఎలా జరగబోతుందో చూడాలి.