ఖర్గేతో సమావేశమైన రేవంత్ రెడ్డి

పార్టీ బలోపేతంపై ఫోకస్;

Update: 2025-07-04 06:57 GMT

నిన్న సాయంత్రం హైద్రాబాద్ చేరుకున్న ఎఐసిసి అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన తాజ్ కృష్ణ చేరుకున్నారు. తాజ్ కృష్ణలో బస చేస్తున్న మల్లి ఖార్జున ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలుసుకుని కొద్దిసేపు భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత గాంధీభవన్ లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఖర్గే తో బాటు కాంగ్రెస్ అగ్రనేత కెసి వేణుగోపాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటిసిఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ , దివంగత మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కుటుంబ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అసంతృప్త వాదులతో సమావేశం

మల్లి ఖార్జున ఖర్గే ఇవ్వాళ అనేక సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కని నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారని సమాచారం. జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆయన పార్టీ ముఖ్యులతో చర్చించనున్నారు.

Tags:    

Similar News