SHE TEAMS | ఈవ్ టీజర్లకు షీ టీమ్స్ షాక్, కౌన్సెలింగ్

హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో ఈవ్ టీజర్లకు షీ టీమ్స్ బృందం మఫ్టీలో వచ్చి షాక్ ఇచ్చింది. ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న షీ టీమ్స్ కౌన్సెలింగ్ చేసింది.

Update: 2024-12-20 09:41 GMT

హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో సాధారణ మహిళల్లాగా మఫ్టీలో వచ్చిన షీటీమ్ మహిళా పోలీసులు పబ్లిక్ గార్డెన్ ఏరియాలో ఉండగా ఆకతాయిలు వారిని వేధించారు. అంతే ఈవ్ టీజర్లను రెడ్ హ్యాండెడ్ గా షీ టీమ్ పోలీసులు పట్టుకున్నారు.

- హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో రెచ్చిపోతున్న ఈవ్ టీజర్లకు షీటీమ్ బృందం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారికి కౌన్సెలింగ్ ఇచ్చింది. హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ ఏరియాలో ఈవ్ టీజర్లు మహిళలను వేధిస్తున్నారని పలువురు బాధితులు షీ టీమ్ కు ఫిర్యాదు చేశారు.
- అంతే షీ టీమ్ ఇన్ స్పెక్టర్ సుజాత ఆధ్వర్యంలో 20 మంది పోలీసులు మఫ్టీలో సాధారణ మహిళల వేషంలో వచ్చి పబ్లిక్ గార్డెన్ లో కాపు కాశారు.అంతలో ఈవ్ టీజర్లు మహిళలు అనుకొని వారిని వేధిస్తుండగా, షీ టీమ్ బృందం 20 మంది పోకిరీలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈవ్ టీజర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు.



 విద్యార్థులకు షీ టీమ్స్ అవగాహన కార్యక్రమాలు

రాచకొండ షీ టీమ్స్ పోలీసులు పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. షీటీమ్ పోలీసులు తాజాగా కుషాయిగూడ జడ్పీహెచ్‌ఎస్ జవహర్‌నగర్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.షీటీమ్స్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పిల్లలను దుర్వినియోగం చేయడం,అమ్మాయిల అక్రమ రవాణా,బాల్య వివాహాలు,లింగనిర్ధారణ,సీసీటీవీ కెమెరాలు,సైబర్ క్రైమ్ నేరాలు,లోన్ యాప్‌లు,యాంటీ ర్యాగింగ్,టీ-సేఫ్ యాప్ మొదలైన వాటి గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
- చౌటుప్పల్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఆరెగూడెం గ్రామం జిల్లాపరిషత్ పాఠశాలలో షీ టీమ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.షీ టీమ్ ఇబ్రహీంపట్నం డివిజన్ మంచాల్ పీఎస్ పరిధిలోని అప్పర్ ప్రైమరీ స్కూల్ బండ లెమూర్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించింది.


Tags:    

Similar News