మొoథా తుఫాను తో తెలంగాణ లో 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం

యిది ప్రాధమిక నివేదిక మాత్రమే అని మంత్రి ఒక ప్రకటనలో చెప్పారు

Update: 2025-10-30 14:34 GMT

మొoథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో 179 మండలాల్లో 2,53,033 మంది రైతులకు చెందిన 4,47,864 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. యిది ప్రాధమిక అంచనా మాత్రమే అని , పూర్తి స్థాయిలో సర్వే కి ఆదేశినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

నివేదిక వరి 2,82,379 ఎకరాల్లో పత్తి 1,51,707 ఎకరాల్లో నష్టం జరిగినట్టు అధికారులు తయారు చేసిన నివేదిక వెల్లడించింది. పంట నష్టం ఎక్కువగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,30,200 ఎకరాల్లో చోటు చేసుకుంది, తరువాత స్థానంలో ఖమ్మం జిల్లా 62,400 ఎకరాల్లో, నల్గొండ జిల్లాలో 52,071 ఎకరాల్లో పంట నష్టం చేసుకుంది.

ఒక ప్రకటన లో నష్ట పోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. వరద ప్రభావిత జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తుమ్మల ప్రకటించారు.ఎకరాకు ఎంత పంట నష్ట పరిహారం ఇవ్వాలో సీఎం రేవంత్ రెడ్డి గారితో చర్చించి నష్ట పోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ఆయన వెల్లడించారు.

తుఫానులో వరి, పత్తి తో పాటు మొక్కజొన్న, మిర్చి, వేరుశెనగ పంటలకు నష్టం జరిగింది.

Tags:    

Similar News