చిరంజీవిపై సోషల్ మీడియాలో భయంకరమైన ట్రోలింగ్స్
దర్యాప్తుచేసి బాధ్యులపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఫిర్యాదులో రిక్వెస్టుచేశారు.
మెగాస్టార్ చిరంజీవికి కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ తప్పటంలేదు. ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ ను టార్గెట్ చేసుకుని కొందరు భయంకరంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే(Chiranjeevi) చెప్పారు. తనపైన భయంకరంగా జరుగుతున్న ట్రోలింగ్స్ ను వెంటనే ఆపాల్సిందిగా చిరంజీవి(Megastar) క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం క్రైమ్ స్టేషన్ కు చేరుకున్న మెగాస్టార్ తనపైన సోషల్ మీడియా(Social media trolling)లో ట్రోలింగ్స్ జరుగుతున్నాయని, దర్యాప్తుచేసి బాధ్యులపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఫిర్యాదులో రిక్వెస్టుచేశారు.
ట్విట్టర్ వేదికగా తనపైన వల్గర్ కామెంట్లు చేస్తున్నట్లు ఆవేధన వ్యక్తంచేశారు. తనఫిర్యాదులో దయాచౌదరి అనే వ్యక్తిపైన చిరంజీవి ఫిర్యాదుచేశారు. మెగాస్టార్ ఫిర్యాదును నమోదుచేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు. ఈమధ్యనే తన ఫొటోను డీప్ ఫేక్ చేసి, మార్ఫింగుచేసి అశ్లీల వీడియోలను వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే. చిరంజీవి ఇదేవిషయమై కోర్టులో కేసు వేయగా బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఇంతలోనే ట్విట్టర్ వేదికగా వల్గర్ కామెంట్లు మొదలవ్వటాన్ని చిరంజీవి తట్టుకోలేకపోతున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చిరంజీవి అంతటి ప్రముఖ వ్యక్తికే సోషల్ మీడియాలో వేధింపులు తప్పనపుడు ఇక మామూలు జనాలసంగతి ఆలోచించాల్సిన అవసరమే లేదు. చిరంజీవి సోషల్ మీడియాను హ్యండిల్ చేయటానికి పెద్ద యంత్రాగమే ఉంది. తనపైన వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెడుతున్నారని తెలుసుకోవటం పెద్ద కష్టమేమీకాదు. అంతయంత్రాంగం ఉండీ మెగాస్టార్ కూడా సోషల్ మీడియా బాధితుడిగా మారిపోవటమే విచిత్రంగా ఉంది.