హైదరాబాద్ లో చెలరేగిపోతున్నడ్రగ్ మాఫియా

వెలుగులోకి మల్నాడు రెస్టారెంట్ యజమాని , ప్రముఖ కార్డియాలజిస్ట్ లపేర్లు;

Update: 2025-07-09 11:30 GMT

హైదరాబాద్ లో డ్రగ్ మాఫియా చెలరేగిపోతుంది. డ్రగ్ మాఫియాలో ప్రముఖ డాక్టర్ పేరు వెలుగు చూడటం ఇపుడు సంచలనమైంది. డ్రగ్స్ ను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఈగల్ టీం ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ పై బుధవారం ఈగల్ టీం దాడులు చేసింది. ఈ తనిఖీల్లో మరొక డ్రగ్స్ రాకెట్‌ గుట్టు రట్టు చేశారు. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఈగల్ టీం అధికారులు గుర్తించారు. సాక్షాత్తు రెస్టారెంట్ నిర్వాహకుడే ఈ డ్రగ్ రాకెట్ కు సూత్రధారి. తన రెస్టారెంట్ కు వచ్చే కస్టమర్లకు తానే దగ్గరుండి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. యజమాని సూర్య నేతృత్వంలో డ్రగ్స్ వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. సూర్యకు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నవారిలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రసన్న ఉన్నట్టు ఈగల్ టీం అధికారులు గుర్తించారు. డాక్టర్ ప్రసన్న ఇప్పటివరకు 20 మంది దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసి తన కస్టమర్లకు విక్రయించేవాడు. 23 మంది వ్యాపారవేత్తలకు ఇప్పటివరకు విక్రయించాడు. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య కు సైతం సరఫరా చేసినట్టు ఈగల్ టీం దర్యాప్తులో తేలింది. భీమవరానికి చెందిన డాక్టర్ ప్రసన్న హర్ష వద్ద డ్రగ్స్ కొనుగోలుచేసినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. హర్ష మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య ఫ్రెండ్.

మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య నేరుగా పబ్ లకు వెళ్లి డ్రగ్స్ సరఫరా చేసినట్టు తెలుస్తోంది. ఫామ్ పబ్, బర్డ్ బాక్స్ పబ్, బ్లాక్ 22 పబ్, వాక్ కోరా పబ్, ప్రిజం పబ్, బ్రాడ్ వే పబ్‌లలో డ్రగ్స్ దందా యదేచ్చగా నడుస్తున్నట్లు ఈగల్ టీ అధికారులు చెప్పారు. వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే యజమానులపై కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News