తప్పులు లేని ఓటర్ల జాబితా తయారు చేయడమే లక్ష్యం

సీఈవో సుదర్శన్ రెడ్డి వెల్లడి

Update: 2025-10-25 13:49 GMT

రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక విస్తృత ఓటర్ జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమ సన్నాహాల పై ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి శనివారం సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సీఈవో సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని కార్యక్రమాలు నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం పోలింగ్ స్టేషన్ లో పురోగతిని సమీక్షిస్తూ ఎలాంటి తప్పులు లేని ఓటర్ జాబితాను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

వచ్చే నెల ఒకటో తేది రోజు సమీక్షా సమావేశం జరుగనుందని, అప్పటి వరకు అన్ని కార్యక్రమాలు పూర్తిచేయాలని సీఈవో ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్, ఉప ముఖ్య ఎన్నికల అధికారి హరిసింగ్ , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇటీవలె సుదర్శన్ రెడ్డి ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సెమినార్ లో పాల్గొన్నారు. తప్పులు లేని ఓటర్ల జాబితాను సిద్దం చేయడమే ఎన్నికల శాఖ ప్రధాన ఉద్దేశ్యమని ఈ సందర్బంగా సుదర్శన్ రెడ్డి అన్నారు.

Tags:    

Similar News