మోత్కులపల్లి వాగులో కొట్టుకుపోయిన భార్యాభర్తలు ?

సిద్దిపేటలో విషాదం

Update: 2025-10-30 12:32 GMT

మొంథా తుఫాను సిద్దిపేట జిల్లాలో విషాదం నింపింది. అక్కన్నపేట మండలం మోత్కుల పల్లి వాగులో భార్యా భర్తలు గల్లంతయ్యారు. ప్రణయ్,కల్పన దంపతులు భీమదేవరపల్లి మండలం నుంచి అక్కన్నపేటకు బయల్దేరారు. మల్లారం రోడ్డు దెబ్బతినడంతో మరో మార్గాన్ని వెతుక్కున్నారు. ఈ మార్గం గుండా మోత్కులపల్లి వాగు ప్రవహిస్తుంది. వర్షాల ధాటికి వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. మోటార్ బైక్ పై వెళుతున్న భార్యా భర్తలు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నా లెక్క చేయకుండా తమ బైక్ ను నీళ్లలో పోనిచ్చారు. బైక్ అదుపు తప్పి నీళ్లలో మునిగిపోయింది. దీంతో భార్యాభర్తలు వాగులో కొట్టుకుపోయినట్టు సమాచారమందుతోంది. వాగులో కొట్టుకుపోయిన విషయం ఎవరికీ తెలియదు. కుటుంబ సభ్యులు భార్యభర్తలను వెతుకుతున్న సమయంలో వారు ప్రయాణించిన మోటార్ బైక్ వాగులో కనిపించింది. నెంబర్ ప్లేట్ ఆధారంగా బైక్ ను బంధువులు , కుటుంబ సభ్యులు గుర్తించారు. దంపతుల జాడ మాత్రం ఇంకా

దొరకలేదు.

Tags:    

Similar News