మక్కా బస్సు ప్రమాదంలో మరణించిన వారు వీరే
మక్కా బస్సు ప్రమాదంలో మరణించిన 45 మందిలో ఒకే కుటుంబంలో 18 మంది ఉన్నారు
సోమవారం తెల్లవారుజామున మక్కాలో జరిగిన బస్సు ప్రమాదంలోని 45మంది ప్రయాణీకులు మరణించినట్లు హైదరాబాద్ లోని హజ్ కమిటి ప్రకటించింది. మక్కా, మదీనా ప్రార్ధనాస్ధలాలను దర్శించుకునేందుకు హైదరాబాదుకు చెందిన ప్రయాణీకులు నాలుగు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా టికెట్లు తీసుకుని ప్యాకేజీటూర్లో వెళ్ళారు. మక్కాను దర్శించుకుని మదీనాకు వెళుతుండగా ముఫ్రిహత్ దగ్గర ఈరోజు తెల్లవారుజామున అంటే భారత కాలమానం ప్రకారం 1.30 గంటలకు ఎదురుగా వస్తున్న డీజల్ ట్యాంకర్ ను బలంగా ఢీకొన్నది.
ఈ ప్రమాదంలో ట్యాంకర్ లోని డీజల్ అంటుకున్నది. అలాగే ట్యాంకర్ లోని డీజల్ బస్సుమీద కూడా పడింది. ప్రమాద తీవ్రతకు బస్సు ట్యాంకులోని ఆయిల్ కూడా బయటకు రావటంతో మంటలు ఒక్కసారిగా బస్సును చుట్టుముట్టింది. ప్రమాదం జరిగినపుడు ప్రయాణీకులందరు గాఢనిద్రలో ఉండటంతో ఏమి జరిగిందో తెలుసుకునేలోపే మంటల బస్సులోపలకు కూడా వచ్చేశాయి. దాంతో ప్రయాణీకులందరు మరణించినట్లు హజ్ కమిటి సభ్యులు వెల్లడించారు. మరణించిన వారిలో పురుషులు 17 మంది, స్త్రీలు 28 మంది ఉన్నట్లు హజ్ కమిటి ప్రకటించింది. మృతులంతా మల్లేపల్లి, బజార్ ఘాట్, అసిఫ్ నగర్ ప్రాంతాలకు చెందిన వారే. దీంతో పై ప్రాంతాల్లో తీవ్ర విషాధచాయలు నెలకొన్నాయి.
హజ్ కమిటి ప్రకటించిన ప్రకారం మృతుల పేర్లు :
1. ఇర్ఫాన్ అహ్మద్
2. హెమేరా నజ్నీన్
3. సబీహా సుల్తానా
4. హమ్దాన్
5. ఇజాన్
6. నజీరుద్దీన్
7. ఉమైజా
8. మరియం ఫాతిమా
9. షేక్ జైనుద్దీన్
10. మెహ్రిష్
11. మొహమ్మద్
12. రిదా తాజుద్దీన్
13. ఉజైరుద్దీన్
14. అఖ్తర్ బేగం
15. అనీస్ ఫాతిమా
16. అమీనా బేగం
17. సారా బేగం
18. సలీం
19. షబానా బేగం
20. హుజైఫా జఫ్పార్
21. రిజ్వానా బేగం
22. సలాఉద్దీన్
23. ఫరానా సుల్తానా
24. తస్మియా తహ్రీన్
25. సనా
26. అబ్దుల్ ఖదీర్
27. గౌసియా బేగం
28. షెహ్నాజ్
29. మొహమ్మద్ ఆలీ
30. రహ్మతబీ
31. రహీమ్ ఉన్నీసా
32. మొహ్మద్ షోహెబ్
33. రాయీస్ బేగం
34. షహజేహాన్
35. సారా మొహమ్మద్
36. మొహమ్మద్ మన్జూర్
37. జహీన్ బేగం
38. ఫర్హీన్ బేగం
39. షౌకత్
40. జకియా
41. పర్వీన్ బేగం
42. మస్తాన్
43. సొహైల్
44. మొహమ్మద్ మౌలానా
45. షిరాహతి మరణించినట్లు హజ్ కమిటి చెప్పింది. వీరిలో అల్ మక్కా ట్రావెల్స్ తరపున 15 మంది, బాబ్ ఉల్ హర్ మైన్ ట్రావెల్స్ నుండి 21 మంది, హఫ్సా ట్రావెల్ ద్వారా ఐదుగురు, మొహమ్మద్ భజైన్ ట్రావెల్స్ నుండి నలుగురు వెళ్ళినట్లు కమిటి ప్రకటించింది.