కేపీసీసీ చీఫ్ గా నేనే కొనసాగుతాను: డీకే శివకుమార్
పార్టీలో క్రమ శిక్షణ కార్యకర్తగా అభివర్ణించుకున్నా ఉప ముఖ్యమంత్రి
By : The Federal
Update: 2025-11-17 06:05 GMT
కేపీసీసీ చీఫ్ గా ఉన్న డీకే శివకుమార్ తన పదవికి రాజీనామా చేస్తున్నారనే వార్తలను ఆయన తోసిపుచ్చారు. తను కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా అభివర్ణించుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పీసీసీ చీఫ్ గా ఉన్న డీకే తప్పుకుని, కొత్త లీడర్ కు అవకాశం ఇస్తారని, అలాగే కర్ణాటక క్యాబినేట్ ను పూర్తిగా ప్రక్షాళన చేస్తారని, రాహుల్ గాంధీతో సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ భేటీ అయ్యాక వార్తలు షికార్లు చేశాయి. అయితే వీటిని తాజాగా డీకే ఖండించారు.
మంత్రివర్గం పునర్వీవ్యవస్థీకరణ అనేదే పూర్తిగా సీఎం సిద్ధరామయ్య నిర్ణయమని, హై కమాండ్ తో చర్చించాక అమలు జరుగుతుందని చెప్పారు.
ఢిల్లీ నేతలను ఆహ్వానించడానికి..
కర్ణాటకలో కొత్తగా వంద కాంగ్రెస్ కార్యాలయాలు నిర్మించబోతున్నామని, ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఆహ్వానించడానికి ఢిల్లీకి వచ్చినట్లు డీకే శివకుమార్ చెప్పారు.
‘‘కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల శంకుస్థాపనతో పాటు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. వీటిని ఎవరూ నిర్వహించాలి. నేను మాత్రమే చేయాలి. నేను రాజీనామా చేస్తానని నేను ఎందుకు చెప్తాను. అలాంటి పరిస్థితి ఇంకా తలెత్తదు’’ అని శివకుమార్ విలేకరులతో చెప్పారు. ‘‘నేను కాంగ్రెస్ పార్టీకి నిబద్దత గల కార్యకర్తను. పార్టీ ఆదేశించిన కార్యకలాపాలను నేను కచ్చితంగా చేస్తాను’’ అని అన్నారు.
నేను బ్లాక్ మెయిల్ చేయను..
‘‘నేను కాంగ్రెస్ పార్టీని బ్లాక్ మెయిల్ చేయను. నేనే ఈ పార్టీని రాత్రింబవళ్లు కష్టపడి నిర్మించాను. ఇదే పనిని భవిష్యత్ లోనూ చేస్తాను. వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తేవడమే మా లక్ష్యం’’ అని డీకే శివకుమార్ ను విలేకరులతో అన్నారు.
వంద కాంగ్రెస్ కార్యాలయాలకు శంకుస్థాపన కార్యక్రమంతో పాటు ఆయన రచించిన గాంధీ- భారత్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ పుస్తకం ఒక శతాబ్ధం క్రితం మహాత్మా గాంధీ నేతృత్వంలోని జరిగిన కాంగ్రెస్ బెళగావి సమావేశాన్ని, ఆ సమావేశాన్ని పార్టీ శతాబ్ధి ఉత్సవాలను ఎలా నిర్వహించిందో వివరిస్తుంది.
కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర ఆదివారం నాడు రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మాత్రమే ఉంటుందని, నాయకత్వ మార్పు ఉండదని సూచించారు. పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని ఊహగానాలు వచ్చాయి.
అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఎలాంటి చర్చలు జరగలేదని, బీహార్ ఎన్నికల ఫలితాలపై చర్చలు జరిగాయని సిద్ధరామయ్య ఢిల్లీలో చెప్పారు.