Revanth and Tollywood|రేవంత్ దెబ్బకు దిగొచ్చిన టాలీవుడ్
టాలీవుడ్ కు చెందిన ఇద్దరు స్టార్లు సామాజికచైతన్యం దిశగా వీడియోలు చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు;
రేవంత్ రెడ్డి ప్రభుత్వం దెబ్బకు టాలీవుడ్ దిగొచ్చింది. టాలీవుడ్ కు చెందిన ఇద్దరు స్టార్లు సామాజికచైతన్యం దిశగా వీడియోలు చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) డ్రగ్స్ కు వ్యతిరేకంగా 28 సెకన్ల వీడియోను చేశారు. ఆ వీడియోలో జనాలకు ముఖ్యంగా యువతకు డ్రగ్స్ కు బానీసలు కావద్దని పిలుపిచ్చారు. ‘సే నో టు డ్రగ్స్’ అని పిలుపిచ్చారు. అలాగే మరో వీడియోలో స్టార్ హోరీయిన్ శ్రీలీల(Srileela) 30 సెకన్ల వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో సోషల్ మీడియా(Social Media)లో ‘అసత్య ప్రచారాలను వ్యాప్తిచేయద్ద2ని విజ్ఞప్తిచేశారు. ‘సోషల్ మీడియాలో లైక్స్ కోసం, వ్యూస్ కోసమని ఫాల్స్ న్యూస్ ను స్ప్రెడ్ చేయద్ద’ని ఆమె విజ్ఞప్తిచేశారు. వ్యూస్ కోసం ఇంకొకరిపై ఉపయోగించుకోవద్దని(బురదచల్లద్దు) ఆమె కోరారు. ‘సోషల్ మీడియాను మంచికోసమే ఉపయోగించుకోవాలని, సామాజిక బాధ్యతగా అందరు ఫాలో అవ్వాల’ని ఆమె చెప్పారు.
ఇంత సడెన్ గా మన స్టార్లకు సామాజికబాద్యత ఎందుకు గుర్తుకొచ్చిందబ్బా ? అంటే రేవంత్ రెడ్డి(Revanth) దెబ్బని అర్ధమవుతోంది. పుష్ప సినిమా(Pushpa Movie) విడుదల సందర్భంగా సంధ్యా ధియేటర్లో(Sandhya Theatre Stampeding) జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించిన విషయం తెలిసిందే. అదే తొక్కిసలాటలో ఆమె కొడుకు శ్రీతేజ్ కోమాలోకి వెళ్ళిన విషయం గుర్తుండే ఉంటుంది. ఘటనకు కారకుడన్న ఆరోపణలపై అల్లుఅర్జున్ పై కేసునమోదుచేసిన పోలీసులు తర్వాత అరెస్టు కూడా చేశారు. అల్లుఅర్జున్ అరెస్టు దెబ్బకు టాలీవుడ్ మొత్తం షేకైపోయింది. దానితర్వాత రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతు తాను సీఎంగా ఉన్నంతవరకు బెనిపిట్ షోలు, ప్రీమియర్ షోలుండవని, సినిమా టికెట్ల రేట్లు పెంపు కూడా ఉండదని ప్రకటించారు. రేవంత్ ప్రటకనతో సినిమాపరిశ్రమలో ఒక్కసారిగా కలకలం పెరిగిపోయింది.
రేవంత్ ను ప్రసన్నంచేసుకునేందుకు సినీఇండస్ట్రీలోని ప్రముఖుల్లో కొందరు ప్రత్యేకంగా భేటీఅయ్యారు. ఆభేటీలో ప్రముఖులను రేవంత్ వాయించినంత పనిచేశారు. టాలీవుడ్ స్టార్లకు సామాజికబాద్యత లేదా అని నిలదీశారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ కు వ్యతిరేకంగా హీరోలు ఎందుకు నోరిప్పటంలేదని అడిగారు. డ్రగ్స్ కంట్రోల్ కు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సినీపరిశ్రమ మద్దతుగా నిలబడాలని ఆదేశించారు. రేవంత్ ఆదేశాలకు భేటీలోని ప్రముఖులు అంగీకరించారు. బహుశా దాని ఫాలోఅప్ అన్నట్లుగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రభాస్, సోషల్ మీడియాలో దుష్ప్రచారం వద్దంటు శ్రీలీల వీడియోలు చేసి ట్విట్టర్లో పోస్టుచేశారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మన హీరోలు మొదటినుండి ప్రభుత్వం తరపున సామాజికబాద్యతగా వీడియోల్లో సందేశాలు ఇవ్వటం తక్కువే. ఏవో సినిమాఫంక్షన్లలో తమఅభిమానులను ఉద్దేశించి రోడ్డుప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మద్యపానం చేసి వాహనాలు నడపద్దని జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) పిలుపిచ్చారంతే. ఆపిలుపు కూడా తన సోదరుడు రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత, సొంత బాధ్యతగా మాత్రమే వీడియో చేశారు. అంతేకాని ప్రభుత్వం తరపున బాధ్యతగా ఫీలై ఎవరూ వీడియోలు చేయలేదు. ఇక హీరోయిన్లయితే మరీ అన్యాయం. ఎన్నికలసమయంలో ఎన్నికల కమిషన్ తరపున ఓటువేయటం ప్రతి ఒక్కరి బాధ్యతగా కొందరు స్టార్లు పిలుపిచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇదితప్ప ప్రభుత్వంతరపున వాలంటీర్ గా సమాజహితం కోసం వీడియోలు చేసింది తక్కువనే చెప్పాలి. రేవంత్-సినీప్రముఖల భేటీ తర్వాతే ఇపుడు ప్రభాస్, శ్రీలీల వీడియోలు రిలీజ్ చేశారు. మరి వీళ్ళబాటలో ఇంకెంతమంది స్టార్లు వీడియోలు చేస్తారో చూడాలి.