హైదరాబాద్‌కు ప్రపంచ సుందరాంగులు, ఆకట్టుకుంటున్న అందాల భామలు
మే 7 నుంచి 31 వరకు జరగనున్న 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచి అందాల ముద్దుగుమ్మలు తరలివస్తున్నారు.;
By : Saleem Shaik
Update: 2025-05-05 11:22 GMT
హైదరాబాద్ నగరంలో మే 7వతేదీ నుంచి 31వతేదీ వరకు జరగనున్న 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి ప్రపంచ సుందరీమణులు తరలివస్తున్నారు. పలు దేశాల సుందరాంగుల రాకతో హైదరాబాద్ నగరంలోని హోటళ్లు కళకళలాడుతున్నాయి. వివిధ దేశాల ముద్దుగుమ్మలు హోటళ్లలో బస చేసి ముచ్చట్లలో మునిగారు.
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన బ్రెజిల్ భామ జెస్సికా పెడ్రోసో, కెనడా అందాల కెరటం ఎమ్మా మోరిసన్, సౌత్ఆఫ్రికా అందాల సుందరి జోయలైజ్ జాన్సెన్ వాన్ రెన్స్‌బర్గ్ మిస్ వరల్డ్ పోటీ కోసం హైదరాబాద్ నగరంలోని ట్రైడెంట్ హోటల్‌లో బస చేశారు. ఈ ముగ్గురు అందాల భామలు అద్భుతమైన ఫోటోకు పోజులిచ్చారు.
హైటెక్స్ వేదికగా ముగింపు ఫెస్టివల్
మే 31వతేదీన 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ అద్భుతమైన ముగింపు కార్యక్రమం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్‌పోజిషన్స్ సెంటర్ (HITEX) ప్రధాన వేదికపై జరగనుంది.ప్రపంచవ్యాప్తంగా 110 మంది అందాల సుందరీమణులు ప్రతి ఖండానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్ అందం ఉద్దేశం అంతర్జాతీయ ఐక్యత.ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన హైటెక్స్ఈ చారిత్రాత్మక మిస్ వరల్డ్ పోటీలకు వేదికగా ఎంపిక చేశారు.
క్రిస్టినా పిజ్జ్కోవా కిరిటాన్ని అందజేస్తారు...
మిస్ వరల్డ్ 72 వ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రేక్షకులు తదుపరి మిస్ వరల్డ్ కిరీటాన్ని ప్రత్యక్ష ప్రపంచ ప్రసారంలో వీక్షించనున్నారు.72 మిస్ వరల్డ్ విజేతకు 71వ మిస్ వరల్డ్ అయిన చెక్ రిపబ్లిక్ క్రిస్టినా పిజ్జ్కోవా కిరీటాన్ని అందజేస్తారు.
మిస్ వరల్డ్ కోసం ట్రైడెంట్ అధికారిక హోస్ట్ హోటల్
మిస్ వరల్డ్ కోసం ట్రైడెంట్ అధికారిక హోస్ట్ హోటల్ గా ఎంపిక చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ లో పాల్గొనే దేశాల ప్రతినిధుల కోసం అధునాతన ప్రపంచ స్థాయి ఆతిథ్యం యొక్క స్వర్గధామం అయిన ట్రైడెంట్ హోటల్ సిద్ధమైంది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేవారు అందమైన లాబీలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి పోటీలు ముగిసే వరకు ట్రైడెంట్ హోటల్ ఆతిథ్యం ఇవ్వనుంది.
నంబర్ వన్ హోటల్
వరుసగా ఐదు సంవత్సరాలుగా ట్రిప్ అడ్వైజరులో హైదరాబాద్‌లోని నంబర్ 1 హోటల్‌గా ఈ హోటల్ ర్యాంక్ పొందింది. 8,000 చదరపు అడుగులకు పైగా బహుముఖ ఈవెంట్ స్థలంతో, విభిన్న జోన్‌లుగా విభజించగల స్తంభాలు లేని బాల్‌రూమ్‌తో సహా, ట్రైడెంట్ హోటల్ ప్రెస్ మీట్ అయినా, రిహార్సల్స్ అయినా, గ్రాండ్ గాలా అయినా, ఈ వేదిక మరపురాని క్షణాలకు వేదికగా నిలవనుంది. మే 6న జరిగే మిస్ వరల్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ట్రైడెంట్ హైదరాబాద్ నిర్వహిస్తుంది.ట్రైడెంట్ హైదరాబాద్‌లో భోజనం చేయడం ఒక వేడుక. అమరా, కనక్, టస్కానీ,నైన్టీ సిక్స్ వంటి రెస్టారెంట్‌లతో అతిథులను ఆకట్టుకోనున్నారు. సాంప్రదాయ భారతీయ రుచికరమైన వంటకాల నుంచి చేతితో చుట్టిన టస్కాన్ పాస్తాలు, లేట్-నైట్ కాక్‌టెయిల్స్ వరకు లభిస్తాయి. శాఖాహారులైన పోటీదారులు భోజనం చేసేందుకు పుష్కలంగా వంటకాలు ఉన్నాయి. ఈ హోటల్ లో విలాసవంతమైన ఫర్నిచర్‌లు, వాక్-ఇన్ వార్డ్‌రోబ్‌లు,అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. ట్రైడెంట్ స్పా, స్విమ్మింగ్ పూల్,ఫిట్‌నెస్ సెంటర్ అందాలభామల శరీరం,మనస్సు రెండింటికీ పునరుజ్జీవనం, విశ్రాంతిని అందిస్తాయి.