ప్రజాస్వామ్యం కావాలంటే మా కూటమికి ఓటు వేయండి: స్టాలిన్

దేశంలో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లాలి అంటే ’ఇండి’ కూటమికి ఓటు వేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్ ఎన్నికల ప్రచారంలో ప్రజలను కోరారు.

Update: 2024-03-30 08:10 GMT
తమిళనాడు ముఖ్యమంత్రి, ఎంకే స్ఠాలిన్

దేశంలో ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం జరగాలంటే ‘ఇండి’ కూటమికి ఓటు వేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై విమర్శలు గుప్పించిన స్టాలిన్, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సరిపడా డబ్బు లేదన్న తన వాదన నిజమైతే, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి అందిన నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు.

"మేడమ్, మీరు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే, మీరు ప్రజలను కలవాలి, ప్రజల సంక్షేమం కోసం కష్టపడాలి, ప్రజలు మీకు ఓటు వేయరని మీకు తెలుసు కాబట్టి, మీరు పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు" స్టాలిన్ విమర్శించారు.
డీఎంకే ధర్మపురి అభ్యర్థి ఎ మణి, కృష్ణగిరి నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థి గోపీనాథ్‌కు లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు వేయాలని స్టాలిన్ ప్రజలను కోరారు. దేశంలో ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం ఉండాలంటే విపక్షాలు జట్టుకట్టిన ఇండి కూటమికి ఓటు వేయాలని అన్నారు. రాబోయే ఎన్నికలు భారతదేశ చరిత్రలో ముఖ్యమైనవని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఇంటికి సాగనంపే సమయం వచ్చిందని అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య పేర్కొన్నారు.
దేశాన్ని కులం మతం ఆధారంగా విభజించాలని బీజేపీ చూస్తోందని టీఎన్ సీఎం ఆరోపించారు. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యాం అంటూ చెప్పిన పట్టాలి మక్కల్ కట్చి ఇప్పుడు అధికారం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుందని దాని అధినేత ఎస్ రామదాస్ ను టార్గెట్ చేస్తూ ఆయన విమర్శించారు. దీని వెనక ఏం రహస్యాలు జరిగాయని అన్నారు. పిఎంకె విధానాలను బిజెపి గతంలో ఎన్నడూ ఆమోదించలేదని తెలిసి కూడా ఆయన (ఎస్‌ రామదాస్‌) ఆ పార్టీలో చేరడానికి కారణం ఏమిటి? అతను అడిగాడు. తమ పార్టీ దేశ వ్యాప్తంగా కులగణన జరపాలని డిమాండ్ చేస్తోందని, దీనిని నిర్వహించే హక్కు కేంద్రప్రభుత్వానికి దే అన్నారు.
"ఒక రాష్ట్ర ప్రభుత్వం కుల ఆధారిత సర్వేను నిర్వహించగలదు కేంద్ర ప్రభుత్వం వలె జనాభా గణనను నిర్వహించదు" అని ఆయన వివరించారు. 12 ఏళ్లుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రాష్ట్రాల హక్కులను కాలరాయడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని డీఎంకే అధ్యక్షుడు విమర్శించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మోదీ ఇటీవల వంటగ్యాస్ ధరలు, ఇంధన ధరలు తగ్గించారని అన్నారు.
Tags:    

Similar News