DMKను ఓడించడమే AIADMK గౌతమి ధ్యేయమా?

తమిళనాడులో పెరిగిపోతున్న నేరాలు, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం పాలనలో మార్పుతోనే సాధ్యమంటున్న సినీ ఇండస్ట్రీ నుంచి పొలిటీషియన్‌గా ఎదిగిన గౌతమి తడిమల్ల..

Update: 2025-09-26 12:37 GMT
Click the Play button to listen to article

గౌతమి తడిమల్ల(Gautami Tadimalla) ప్రస్తుతం AIADMK డిప్యూటీ ప్రచార కార్యదర్శిగా కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు(Assembly Elections) జరగనున్న నేపథ్యంలో ‘‘ది ఫెడరల్‌’’ ఆమెను ఇంటర్వ్యూ చేసింది. పార్టీలో తన పాత్ర, ఎడప్పాడి కె పళనిస్వామి (EPS) నాయకత్వం, ఎన్నికలకు ముందు బీజేపీతో జతకట్టడం గురించి చాలా విషయాలు మాట్లాడారు.

Full View


AIADMK డిప్యూటీ ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించడం మీకెలా అనిపిస్తుంది?

పార్టీ ప్రచారానికి మించిన హోదా అది. ప్రస్తుతం మా ఫోకస్ అంతా తమిళనాడు ఎన్నికలపైనే. కొత్త తరం ఓటర్లు భిన్నంగా ఆలోచిస్తారు. వారి ఆలోచనలకు అనుగుణంగా మనం మాట్లాడే విధానం మారాలి. నా విషయానికొస్తే అన్ని వర్గాల ఓటర్లను చేరుకోడానికి కృషి చేస్తున్నా.

సోషల్ మీడియా ఇప్పుడు ఒక శక్తివంతమైన సమాచార సాధనం.. కాని మీరు ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలో పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువ. సోషల్ మీడియా గురించి మీ అభిప్రాయమేంటి?

సోషల్ మీడియా అనేది కమ్యూనికేషన్ కోసం వాడే ఒక సాధనం మాత్రమే. దాని ద్వారా మీరు ఏ సమాచారాన్నయినా ప్రజల వద్దకు తీసుకెళ్లొచ్చు. మంచి విషయమైతే మీ ఇమేజ్ పెరుగుతుంది. మీకు సానుకూలంగా కామెంట్స్ వస్తాయి. నచ్చని విషయమైతే అదే స్థాయిలో విమర్శలూ వస్తాయి. కాబట్టి మీ లక్ష్యాల కోసం దాన్ని ఎలా వాడుకుంటారో ముందుగా తెలుసుకోవడం ముఖ్యం.

సోషల్ మీడియా కాకుండా మీరు ప్రజలతో ఎలా కనెక్ట్ అవుతారు?

నేను ఎప్పుడూ ముఖాముఖి మాట్లాడటానికే ఇష్టపడతా. అందుకే తరచుగా విమానంలో కాకుండా రోడ్డు మార్గంలో ప్రయాణిస్తా. గ్రామాలు, పట్టణాలను దాటుతూ వెళ్లడం వల్ల ప్రజలు జీవనం విధానం, వారి సమస్యలేమిటో, వారి ఏం కోరుకుంటున్నారో తెలుసుకునే అవకాశం ఉంటుంది.

తమిళనాడు రాజకీయాలను పరిశీలిస్తే.. సినీ నేపథ్యం ఉన్న వారు మాత్రమే ముఖ్యమంత్రులు కాగలిగారు. అది ఎంజి రామచంద్రన్ (ఎంజిఆర్), జయలలిత లేదా కరుణానిధి కావచ్చు. ఈపీఎస్‌కు ఇది ప్రతికూల అంశం అవుతుందా?

నటనలో రాణించినంత మాత్రాన .. సమర్థవంతమైన రాజకీయ నాయకుడిగా మారరు. ఎంజీఆర్ లేదా జయలలిత వంటి నాయకులకు కూడా పొలిటికల్ కెరీర్‌లో నిలదొక్కుకునేందుకు చాలా దశాబ్ధాలు పట్టింది. AIADMKలో EPS ప్రస్థానం చాలా ఏళ్ల నాటిది. ప్రతి స్థాయిలోనూ చాలా పదవులు చేపట్టారు. అదే నాయకత్వానికి నిజమైన పునాది. ఆయన వ్యక్తిత్వంలో లోటు లేదు. ఆయన మాటల్లో స్పష్టత ఉంటుంది. రెండు గంటల పాటు మీడియా ప్రతినిధులతో ప్రసంగించారు. ప్రతి ప్రశ్నకు సమాధానమివ్వడం నాయకుడి లక్షణం.

తిరుగుబాటుదారుల కారణంగా అన్నాడీఎంకే బలం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. బీజేపీతో పొత్తువల్ల క్యాడర్‌లో కొంత వ్యతిరేకత ఉంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలను మీరు సమర్థవంతంగా ఎలా ఎదుర్కొంటారు?

పార్టీ బలంగా ఉంది. ఐక్యంగానూ ఉంది. ఓ పన్నీర్‌సెల్వం లేదా టీటీవీ దినకరన్ లాంటి నాయకులు వెళ్లిపోవడాన్ని పార్టీలో చీలికలుగా చూడరాదు. వ్యక్తిగత కారణాలు కూడా ఉండొచ్చు. డీఎంకేను చూడండి. కాంగ్రెస్‌(Congress)తో చేతులు కలిపి పదేళ్లు వెలిగింది. భాగస్వాములను తీసేసి చూడండి. డీఎంకేకు అంత బలం కనిపించదు.

బీజేపీతో AIADMK కలిసి పనిచేయడాన్ని ఎలా చూస్తారు?

ఈ పొత్తుకు స్పష్టమైన లక్ష్యం ఉంది. అదే డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించడం. ఒకే సంతకంతో నీట్ (NEET) రద్దు చేస్తామని గతంలో డీఎంకే హామీ ఇచ్చింది. అది పచ్చి అబద్ధం. NEET వాస్తవికతను గుర్తించి, నిర్మాణాత్మక పరిష్కారం కోసం EPS కృషి చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 7.5 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో వేలాది మంది వైద్యులయ్యారు. లేకపోతే వారికి ఎప్పటికీ అవకాశం దక్కేదికాదు.

మీరు బీజేపీ(BJP)కి దూరమై దాదాపు 25 సంవత్సరాలవుతోంది? ఇప్పుడు AIADMK మళ్ళీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంది? దాన్ని మీరెలా చూస్తారు?

ఒక గొప్ప కార్యం కోసం తీసుకున్న రాజకీయ నిర్ణయం అది. తమిళనాడులో కొంతమంది వ్యక్తులతో తప్ప..జాతీయ స్థాయిలో నాకు బీజేపీతో ఎలాంటి విభేదాలు లేవు. కాని ఇప్పుడు బీజేపీతో కలిసి పనిచేయకుండా నన్ను ఎవరూ ఆపలేదు. నా లక్ష్యం అన్నాడీఎంకే, మిత్రపక్షాల తరుపున ప్రచారం చేయడం.

నటుడు విజయ్(Vijay) రాజకీయ ప్రవేశం.. టీవీకే(TVK) పాత్ర గురించి మీరు ఏమనుకుంటున్నారు? భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉంటుందా?

ఊహించినట్లుగానే తంబి (సోదరుడు) విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. సంచలనం సృష్టించింది. ఆయన స్టార్‌డమ్ ప్రతిబింబిస్తుంది. DMK అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు సరైన మార్గంలో ముందుకు సాగుతున్నారు. భవిష్యత్తులో సంకీర్ణం ఏర్పడితే, అది తమిళనాడు అభివృద్ధికి దోహదపడుతుంది.

ప్రస్తుత రాజకీయాలు భిన్నమైనవి. వ్యక్తిగత ఘర్షణలతో కూడుకున్నవి. వాటిని ఎలా ఎదుర్కొంటారు?

సినిమాల్లో కూడా నన్ను ఇదే ప్రశ్న అడిగారు. అవును.. రాజకీయాలు కఠినమైనవి.. కానీ అందులో నిర్మాణం, వ్యూహం, మేధోవాదం సాధనకు కూడా అవకాశం ఉందని నేను నమ్ముతాను. మీరు ఎవరు, ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు? ఏ మార్గాన్ని ఎంచుకుంటారన్నది కీలకం. ఈ విషయాల్లో స్పష్టంగా ఉంటే..ప్రజలు సహజంగానే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. తదనుగుణంగా స్పందిస్తారు. అయితే మీరు ఎలా ప్రవర్తిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది.

మీరు సినిమాలకు దూరమయ్యారు? తమిళ ఇండస్ట్రీకి తిరిగి వస్తారా?

నేను ఎప్పుడూ సినిమాలు వదిలిపెట్టలేదు. నేను ఇతర భాషలలో, OTT ప్లాట్‌ఫాంల్లో పనిచేస్తున్నా. నేను ఇటీవల తమిళ సినిమాలు చేయకపోవడానికి కారణం.. నిర్మాణ సంస్థలు DMK ఆధీనంలో ఉండడమే. దాన్ని నేను వ్యతిరేకించాను. అందుకే నన్ను దూరం పెట్టారు. కానీ త్వరలోనే ఇండస్ట్రీకి తిరిగి వస్తానన్న నమ్మకం ఉంది.

మీరు తరచుగా డీఎంకే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు? వారితో మీకున్న ప్రధాన సమస్యలేంటి?

కొన్నింటి గురించి నేను చెబుతా. ముందుగా భద్రత. తమిళనాడు ఒకప్పుడు అత్యంత సురక్షిత రాష్ట్రాలలో ఒకటి. కానీ ఇప్పుడు కాదు. మహిళలు, వృద్ధులపై హింస పెరిగిపోయింది. బాలికలు, వృద్ధులపై లైంగిక నేరాలు ఎక్కువయ్యాయి. బయటకు వెళ్లిన తమ కూతురు సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తుందన్న నమ్మకం కూడా లేదు. ప్రజలకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత. పొల్లాచ్చి అత్యాచార కేసును EPS ఎలా స్వతంత్ర సంస్థకు అప్పగించారో మీకు తెలుసు. నాయకత్వం అంటే అది. రెండోది జీవన వ్యయం. విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరిగాయి. ఆస్తి పన్నులు పెరిగాయి, ఎంప్లాయ్‌మెంట్ చూపడం లేదు. జీతాలు పెరగలేదు. మూడోది..దళితులపై దారుణాలు. డీఎంకే వారి మంచి కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటుంది. కానీ దారుణాలు మాత్రం జరిగిపోతున్నాయి. వెంగైవాయల్ గురించి అందరికి తెలిసిన విషయం. నామక్కల్ కిడ్నీ రాకెట్‌పై న్యాయమైన దర్యాప్తునకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.

Tags:    

Similar News