కన్నడ కుర్చీ కొట్లాట నిజంగానే సద్దుమణిగిందా?

ఎన్నికల వరకు తానే సీఎంగా కొనసాగుతానని సిద్దరామయ్య ప్రకటన.. మౌనంగా ఉన్న డిప్యూటీ ‘డీకే’;

Update: 2025-07-05 11:19 GMT
కర్ణాటక ముఖ్యమంతి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్

వచ్చే ఎన్నికల వరకూ తానే సీఎంగా ఉంటానని సిద్దరామయ్య ప్రకటన, దానిపై డీకే శివకుమార్ నిశ్శబ్ధం చూస్తుంటే ఇది ముందస్తు స్క్రిప్ట్ లాగా కనిపిస్తుంది. వీటిని మనం పూర్తిగా నమ్మలేము.

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ను నియమిస్తారా? లేరా? అనే ప్రశ్న 2023 ఎన్నికల్లో పార్టీ అఖండ మెజారిటీతో గెలిచినప్పటి నుంచి వెంటాడుతోంది. 2028 వరకు తాను ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతానని సిద్ధరామయ్య ప్రకటించడంతో ఈ ప్రశ్నకు ప్రస్తుతానికి సమాధానం లభించింది. ఆయన డిప్యూటీ డీకే శివకుమార్ కూడా దీనికి అంగీకరించారు. తనకు సిద్దరామయ్యకు తోడుగా ఉండటం తప్ప వేరే మార్గం లేదని అన్నారు.
స్థిరత్వం పై దృష్టి పెట్టండి..
సిద్దరామయ్య వాదన, డీకే మౌనం ఎవరికి అర్థంకానట్లుగా ఉన్నాయి. ఇక్కడ అసలు సమస్య స్థిరత్వం. బీజేపీ నుంచి ముప్పు కాచుకుని ఉంది. కాంగ్రెస్ కు ఇంతకుముందు ఫిరాయింపుల అనుభవం ఉంది.
అందువల్ల పార్టీ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వాన్ని అస్థిరపరచకుండా జాగ్రత్త వహించి, పరివర్తనను సాధ్యమైనంత సజావుగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఈ సమయంలో శివకుమార్ ముఖ్యమంత్రి కావాలనే తన ఆశయాన్ని వదులుకున్నారని అర్థం చేసుకోవడం ఏమంత కష్టం కాదు.
ముఖ్యమంత్రి కావాలనుకుంటే ముందుగా ఉన్న ముఖ్యమంత్రి చేత వివిధ కారణాలు చూపుతూ తనంతట తానుగా రాజీనామా చేసి, శివకుమార్ ను అత్యున్నత పదవికి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించవచ్చు. ఈ విధంగా సిద్ధరామయ్య తన మద్దతుదారుల వర్గంలో ఏవైనా ప్రతికూల చర్యలను ముందస్తుగా నిరోధించవచ్చు. డీకేకు పార్టీ తన పూర్తి పదవీకాలాన్ని పూర్తిచేసే అవకాశాలను మెరుగుపరుస్తుంది.
అధికార భాగస్వామ్య ఒప్పందం..
శివకుమార్ రెండవసారి మాట్లాడానికి సిద్ధంగా ఉండటం అసమ్మతిని రేకేత్తించడానికి కారణం. అయితే ఆయన ఎక్కడా ముఖ్యమంత్రి పదవిని కావాలని తన కోరికను బయటపెట్టలేదు. గుంభనంగా వ్యవహరిస్తూ తెరచాటున ప్రయత్నాలు చేస్తున్నారు. 
కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తుతం 224 మంది సభ్యులు ఉన్నారు. ఇక్కడ మెజారిటీకి 113 సీట్లు అవసరం. మొన్న జరిగిన ఎన్నికల్లో 136 సీట్లు సాధించింది సంపూర్ణ మెజారిటీ సాధించింది గ్రాండ్ ఓల్డ్ పార్టీ. సిద్దరామయ్య సీఎం అయిన రోజు నుంచి ఈ చర్చ ప్రారంభం అయింది.
అయితే ఈ చర్చ, అసమ్మతిని హైకమాండ్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా సమర్థవంతంగా అణచివేయగలిగారు. ప్రస్తుతం కొంతమంది శాసనసభ్యులు ఐదేళ్ల పదవీకాలం ప్రారంభంలో సిద్దరామయ్య, శివకుమార్ మధ్య జరిగిన ఒక ఒప్పందాన్ని ప్రస్తావిస్తున్నారు.
దీనికి ప్రకారం ఇద్దరు చెరో 2.5 సంవత్సరాలు సీఎంగా కొనసాగాలి. అలాంటి ఒప్పందం నిజంగా ఉంటే దానిని అమలు చేయాలనుకుంటే సిద్దరామయ్య కు ఈ సంవత్సరం నవంబర్ వరకు సమయం ఉంది.
ఈ ఒప్పందం విషయం సిద్దరామయ్య, డీకే శివకుమార్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, గాంధీ కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ ఎవరు చెప్పలేరు. మిగిలిన వాళ్లకు తెలియదు. అయితే ఈ ఊహగానాలు మాత్రం ఆగడం లేదు.
శివకుమార్ పోటీ..
అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం తరువాత జరిగిన పరిణామాలను ఒకసారి చూస్తే.. ఇద్దరి మధ్య ఏదైనా ఒప్పందం ఉందా అనే విషయంలో ఒక క్లూ లభిస్తుంది.
ఆ సమయంలో ముఖ్యమంత్రి పదవికీ డీకే శివకుమార్ గట్టీ పోటీదారుడిగా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ విజయం సాధించడానికి ఆయన చేసిన వ్యవస్థాగత ప్రణాళిక కీలకపాత్ర పోషించింది. కాబట్టి ఆయన సీఎం పదవి తనకు లభిస్తుందని ఆయన భావించారు.
శివకుమార్ వాదనకు బలం చేకూర్చేలా ఫలితాలను ముందు ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో పార్టీ 136 సీట్లు గెలుచుకుంటుందని ఆయన అంచనా వేశారు. అందరిని ఆశ్చర్యపరిచే విధంగా కాంగ్రెస్ సరిగ్గా అన్నే సంఖ్యలో సీట్లు సాధించింది. పార్టీ విజయం సాధించిన తరువాత తదుపరి ముఖ్యమంత్రి ఎవరు కావాలో నిర్ణయించుకోవడానికి బెంగళూర్, ఢిల్లీలో తీవ్రమైన లాబీయింగ్, చర్చలు జరిగాయి.
చివరకు సీఎంగా సిద్ధరామయ్య, ఆయనకు డిప్యూటీగా శివకుమార్ నియామకం జరిగింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సీఎం పదవికి చివరి నిమిషం వరకు డీకే చేసిన లాబీయింగ్. కానీ ఈ సమస్యను ఖర్గే విజయవంతంగా పరిష్కరించారు. సీఎం పదవిని ఇద్దరికి సమానంగా పంచి ఇస్తామనే వాగ్థానం దీనికి కారణం.
మాస్ లీడర్ వర్సెస్ మాస్టర్ స్ట్రాటజిస్ట్
శివకుమార్ ప్రధాన వ్యూహకర్త. అయితే సిద్ధరామయ్యకు ఆస్తి ఏమిటంటే అనుభవం, ప్రజా నాయకుడిగా ఆయనకున్న ఖ్యాతి 2013-2018 మధ్య ఆయన సీఎంగా తన పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఎన్నికల ముందు ఇద్దరు తెలివైన రాజకీయ నాయకులు విజయవంతంగా కలిసి పనిచేయడం వల్ల పార్టీకి అద్భుతమైన ఫలితం లభించింది.
136 మంది కాంగ్రెస్ కాంగ్రెస్ శాసనసభ్యులలో అత్యధికంగా సిద్ధరామయ్య మద్దతుదారులే అని అంగీకరిస్తున్నారు. శివకుమార్ ఓ ఫుష్ ఓవర్ అని దీని అర్థం కాదు. రాష్ట్ర కాంగ్రెస్ లో కూడా ఆయనకు మద్దతుదారులు ఉన్నారు. అవినీతి ఆరోపణలపై కేంద్ర సంస్థలు తనపై దర్యాప్తు చేసిన తరువాత బీజేపీలో చేరాలని ఒత్తిడి వచ్చినప్పుడూ శివకుమార్ పార్టీతోనే ఉన్నారని ఆయనకు పేరుంది.
జూలై 2019 లో కాంగ్రెస్, జనతాదళ్(ఎస్) శాసనసభ్యులలో ఒక వర్గం బీజేపీలోకి ఫిరాయింపు చేసినప్పుడు దానిని ఆపడానికి చేసిన తీవ్రమైన ప్రయత్నాలు ఆయనకు పార్టీలో మంచి పేరును తీసుకొచ్చాయి. ఈ సందర్భంగా ఆయన పార్టీలోని ఎమ్మెల్యేలను ముంబైలోని ఓ హోటల్ కు పంపడం పెద్ద చర్చకు దారితీసింది.
అంతకుముందు 2017 లో సీనియర్ కాంగ్రెస్ సభ్యుడు, సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ రాజ్యసభకు తిరిగి ఎన్నికైన సందర్భంగా అప్పుడు కూడా డీకే కీలకపాత్ర పోషించారు. గుజరాత్ శాసనసభ్యులను ఐక్యంగా ఉండేలా చూసుకోవడానికి కర్ణాటకలోని ఓ రిసార్ట్ కు తీసుకెళ్లారు. అతని ప్రయత్నాలకు కాంగ్రెస్ లో విస్తృతంగా ప్రశంసలు వచ్చాయి.
ఇరుకున పడిన హైకమాండ్..
సిద్దరామయ్య మొదట జనతాదళ్ కు చెందిన వాడు. అయితే 2006 లో కాంగ్రెస్ లో చేరిన సమయంలో ఆ పార్టీ సమర్థుడైన నాయకుడు లేడు. ఇదే సమయంలో కాంగ్రెస్ లో చేరడం ఆయనకు లాభించింది. ఆయన త్వరగానే ఉన్నత స్థానానికి ఎదిగారు. అంతేకాకుండా 2013 లో కాంగ్రెస్ ను విజయపథంలో నడిపించి తన స్థానం పదిలం చేసుకున్నారు.
ఇద్దరు నాయకుల ప్రత్యేక లక్షణాలను బట్టి చూస్తే కాంగ్రెస్ ఇప్పుడు దీన్ని ఎలా హ్యండిల్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతం సిద్ధరామయ్య తాను మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ప్రకటించారు.
2006 లో బీజేపీ- జేడీ(ఎస్) లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడూ ఇదే సమస్య ఎదురైంది. కుమారస్వామి తన పదవీకాలం పూర్తయిన తరువాత తన సంకీర్ణ భాగస్వామి బీఎస్ యడియూరప్పకు సీఎం పదవిని అప్పగించాల్సి ఉండేది.
కానీ కొన్ని రోజులకే కుమారస్వామి సంకీర్ణం నుంచి బయటకు రావడంతో ప్రభుత్వం కూలిపోయింది. సంఘటన తరువాత 2008 లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచి యడియూరప్ప సీఎంగా కూర్చున్నారు. దీనికి సానుభూతే కారణం.
హాబ్సన్ ఎంపిక..
సీఎం పీఠంపై డీకే శివకుమార్ ఆశ వదులకున్నారని చెప్పడం కష్టం. ఆయన ఈ కుర్చీ కోసం చేసిన లాబీయింగ్ ను చూసి ఈ అంచనాకు రావచ్చు. ఈ వారం ప్రారంభంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి కావాలనే ఆశయం మీకు లేదా అనే ప్రశ్నకు ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కేవలం నవ్వుకుంటూ ఉన్నారు. సాధారణంగా ఆయన మంచి వాగ్థాటితో మాట్లాడతారు.
కాంగ్రెస్ కు ఇది ఒక క్లాసిక్ హాబ్సన్ ఎంపిక పరీక్ష. పార్టీ శివకుమార్ బాధ్యత వహించకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పలేము. సిద్దరామయ్య స్థానంలో ఆయన వస్తే దానికి కూడా వేరే పరిణామాలు సిద్దంగా ఉంటాయి.
2019 లో హెచ్ డీ కుమారస్వామికి సీఎం పీఠం అప్పగించే సమయంలో సిద్దరామయ్య మద్దతుదారులు అంగీకరించలేదని, ఇందులో కొంతమంది ఫిరాయింపుదారులను ఆయన వర్గం ప్రొత్సహించిందని కాంగ్రెస్ లోనే పుకార్లు వినిపించాయి. పరిస్థితిని నేర్పుగా పరిష్కరించకపోతే ఈసారి కూడా ఇదే పునరావృతం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
పార్టీపై డీకే పట్టు..
ప్రస్తుత ప్రభుత్వంలో ఇద్దరి ట్రాక్ రికార్డు ఏమంత గొప్పగా లేదు. అలా అని తీసిపారేయడానికి వీలులేదు. సిద్ధరామయ్య ప్రస్తుతం ముడా కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
అలాగే వాల్మీకీ కుంభకోణంలోనూ ఇబ్బంది పడుతున్నాడు. డీకే విషయానికి వస్తే ఆర్సీబీని సత్కరించడానికి చేసిన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట సంఘటన బాగా ఇబ్బంది పెడుతోంది. ఇక్కడ దాదాపు 11 మంది క్రికెట్ అభిమానులు మరణించారు.
అయితే రెండు ఫలితాలు మాత్రం డీకేకు పార్టీపై అపారమైన పట్టు ఉందని వెల్లడిస్తున్నాయి. ఒకటి ప్రభుత్వం కొత్త కుల సర్వే చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం, రెండో ఆయన ఇంకా కేపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ఇద్దరు రాజకీయ నాయకులు పలు విషయాలపై వ్యక్తిగతంగా స్పందించకపోయినా తమ కోరిను నెరవేర్చుకునే స్థాయిలో శాసనసభ్యుల మద్దతును కూడగట్టుకున్నారు. ప్రస్తుత పరిస్థితులలో శివకుమార్ బలమైన కోట అయిన రామనగర ఎమ్మెల్యే ఇక్భాల్ హుస్సేన్ ముఖ్యమంత్రిని మార్చాలని బహిరంగ పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎమ్మెల్యేకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. కానీ ఇది కేవలం ప్రదర్శన ఆర్భాటం మాత్రమే అని చెప్పవచ్చు.
Tags:    

Similar News