‘రైతుల సంక్షేమం పట్టని డీఎంకే ’
వరి రైతులను ఆదుకోవాలని TVK చీఫ్ విజయ్ డిమాండ్..
By : The Federal
Update: 2025-10-28 10:42 GMT
రైతులను ఆదుకోవడంలో డీఎంకే(DMK) ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు తమిళగ వెట్రీ కజగం (TVK) చీఫ్ విజయ్(Vijay). తంజావూరు సహా ఇతర జిల్లాల్లో వర్ష కారణంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వ జాప్యాన్ని ఆయన ప్రశ్నించారు. రైతుల సంక్షేమాన్ని సీఎం స్టాలిన్ గాలికొదిలేశారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే వరి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాకాలంలో పంటలకు నష్టం జరగకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలను బహిర్గతం చేయాలని కోరారు.
"వరి(Paddy) బస్తాలు వర్షానికి తడిసి మొలకెత్తాయి. రైతుల ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. కేవలం ప్రచారాన్ని మాత్రమే కోరుకునే ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి, ’’ అని విజయ్ అన్నారు.