మావోయిస్ట్ పార్టీకు భారీ షాక్.. మరో కేంద్ర కమిటీ సభ్యుడు లొంగుబాటు
తెలంగాణ ఎస్ఐబీ ఆపరేషన్‌లో లొంగిపోయిన పుల్లూరు ప్రసాద్‌రావు అలియాజ్ చంద్రన్న.
మావోయిస్ట్ పార్టీకి కోలుకునే సమయం కూడా దక్కడం లేదు. ఒకరి తర్వాత ఒకరుగా కీలక నేతలు పోలీసుల ముందు లొంగిపోతున్నారు. ఆశన్న లొంగుబాటు నుంచి కోలుకోక ముందే తాజాగా బండి ప్రకాష్.. తెలంగా డీజీపీ ఎదుట లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలవడానికి అంగీకరించారు. దానిని మావోయిస్ట్ పార్టీ స్వీకరించే లోపే మరో భారీ దెబ్బ తగిలింది. మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాద్ రావు అలియాజ్ చంద్రన్న కూడా పోలీసుల ముందు లొంగిపోయారు. తెలంగాణ ఎస్ఐబీ(స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో) చేపట్టిన ఆపరేషన్‌లో చంద్రన్న లొంగిపోయారు. దీంతో మావోయిస్ట్ పార్టీ పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడినట్లయింది.
చంద్ర.. తెలంగాణ పెద్దపల్లి జిల్లాలోని ఎడ్కాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఈ ఏడాది మే నెలలో కర్రెగుట్ట ఎన్‌కౌంటర్‌లో చంద్ర మరణించినట్లు వార్తలు వచ్చాయి. కాగా ఆ ఎన్‌కౌంటర్ ఆయన తప్పించుకున్నాడని, ఇప్పుడు తెలంగాణ పోలీసు ముందు లొంగిపోయారని పోలీసు వర్గాలు చెప్తున్నాయి.