శాశ్వత పౌరులకు తాత్కాలిక ఉద్యోగాలా?

"రోజూ లక్షలాది మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నారు.వారి అంకితభావానికి ప్రతిఫలంగా దక్కుతున్నది మాత్రం అన్యాయం" అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Update: 2024-09-02 10:32 GMT

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరోక్షంగా ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శించారు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ)లో తాత్కాలిక నియామకాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గత బుధవారం రాహుల్ బస్సులో ప్రయాణించారు. అనంతరం డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులతో సమావేశమయ్యారు. వారు తమ ఇబ్బందులను రాహుల్ దృష్టికి తెచ్చారు.

మంగళవారం సామాజిక మాధ్యమం వేదికగా రాహుల్ స్పందించారు. ‘‘డీటీసీ ఉద్యోగులకు సామాజిక భద్రత లేదు. స్థిరమైన ఆదాయం లేదు. శాశ్వత ఉద్యోగమూ లేదు. డ్రైవర్లు, కండక్టర్లు అభద్రతాభావంతో బతకాల్సిన పరిస్థితి. ప్రయాణికుల భద్రత కోసం పనిచేసే హోంగార్డులకు ఆరు నెలలుగా జీతాలు లేవు’’ రాహుల్ అన్నారు.

"ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు జాగ్రత్తగా చేరుస్తున్నారు.వారి అంకితభావానికి ప్రతిఫలంగా దక్కుతున్నది మాత్రం అన్యాయం" అని కూడా పేర్కొన్నారు.సమాన పనికి సమాన వేతనం డిమాండ్లు స్పష్టంగా ఉన్నా..ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

Tags:    

Similar News