ప్రలోభ పెట్టారు.. జైలు పాలయ్యారు..

కొడుకులో వచ్చిన మార్పుపై ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. విచారణలో వీస్తూపోయే నిజాలు బయటపడ్డాయి.

Update: 2023-12-02 14:57 GMT

ఆ అబ్బాయి ఇంటర్‌ పూర్తి చేశాడు. వయసు 17 ఏళ్లు. తండ్రి వ్యాపారి. కొడుకు ప్రవర్తనలో వచ్చిన మార్పుపై తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడని కొన్ని రోజులు ఆలోచనలో పడ్డారు. ఓ రోజు కొడుకు బయటకు వెళ్లగానే.. తను ఎక్కువగా వాడే ల్యాప్‌టాప్‌ను తీసి చూశారు. అందులో కొన్ని మతపర పుస్తకాలు, ఫొటోలు, కొన్ని వాక్యాలు డౌన్‌లోడ్‌ చేసి ఉన్నాయి. వీడేమైనా మతం మారాడా? అని సందేహ పడ్డారు. మన వాడు అలా ఎందుకు చేస్తాడని భార్యభర్తలు ఒకరినొకరు ధైర్యం చెప్పకున్నారు. కొద్ది రోజులకు వారి అనుమానం బలపడింది.

జిమ్‌ పేరుతో రోజు బయటకు వెళ్లి కొన్ని గంటల తర్వాత ఇంటికి రావడాన్ని గమనించిన తండ్రి.. ఓ రోజు కొడుకును ఫాలో అయ్యాడు. నేరుగా అబ్బాయి ఓ ప్రార్థనా ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ ప్రార్థనలు చేశాడు. ఇంటికి తిరిగొచ్చాక ఎక్కడికెళ్లావు? ఎందుకింత ఆలస్యమైందని గట్టిగా అడిగాడు తండ్రి. మొదట బుకాయించాడు. అలాంటిదేమి లేదని నమ్మించబోయాడు. తండ్రి కాస్త దగ్గరకు వెళ్లి నిజం చెప్పు అని చేయెత్తబోయాడు. అది.. అది.. అంటూ నెమ్మదిగా నిజం చెప్పాడు. మతం స్వీకరించానని బదులిచ్చాడు. అలా చేయడం మంచిది కాదు. పద్ధతి మార్చుకోవాలని గట్టిగా దండించాడు తండ్రి. తీరు మారకపోతే ఇంటి నుంచి బయటకు గంటేస్తామని వార్నింగ్‌ కూడా ఇచ్చాడు. తను ఇల్లు వదిలితే.. ప్రార్థనా ప్రదేశానికే వెళ్తాననడడంతో తండ్రికి కోపం ముంచుకొచ్చింది. అప్పటికి శాంతంగా ఉన్నట్టే నట్టించి, మరుసటి రోజు పోలీసులకు కంప్లైట్‌ చేశాడు. తన కొడుకులో వచ్చిన మార్పును వారికి వివరించాడు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కొత్త విషయాలు తెలిశాయి. కుర్రాడి సెల్‌ నంబర్‌ ఆధారంగా కాల్‌ డేటా సేకరించారు. ఎవరెవరితో ఎక్కువ సేపు మాట్లాడాడో పసిగట్టారు. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తితో టచ్‌లో ఉన్నాడని నిర్ధారణకు వచ్చారు. ఓ రోజు అబ్బాయిని పిలిపించి.. సున్నితంగా ప్రశ్నించారు. చివరకు నోరు విప్పాడు. ముంబాయిలో ఉంటున్న ఓ వ్యక్తి తనకు ఆన్‌లైన్‌ గేమింగ్‌లో పరిచయమయ్యాడని, ఆ వ్యక్తే తనకు లాప్‌టాక్‌ కొనిచ్చాయడని చెప్పాడు. ఆ వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీశారు. ఓ మత ప్రదేశానికి అతను కేర్‌ టేకర్‌గా ఉన్నట్లు తెలుసుకున్నారు.

చివరకు తండ్రి ఫిర్యాదుమేరకు.. లాప్‌ట్యాంక్‌ కొనిచ్చిన వ్యక్తిపై ఎస్‌ఐఆర్‌ ఫైల్‌ చేశారు. చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ చట్టం కింద అరెస్టు చేశారు.

42 మందిపై కేసు నమోదు

కొంతమంది పేదలు, బలహీనులను ఆసరాగా చేసుకుని మత మార్పిడులను పాల్పడుతున్నారు. ఇటీవల ఉత్తర్‌ ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో నిరుపేదలు, గిరిజనులను టార్గెట్‌గా చేసుకుని వారిని క్రైస్తవ మతంలోకి మార్చడమే పనిగా పెట్టుకున్నారు కొందరు. ఈ విషయంపై చోపాన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మల్హియా తోలా నివాసి అయిన నర్సింహ పోలీసులకు కంప్లైంట్‌ చేశాడు. ఫిర్యాదు ఆధారంగా మత మార్పిడికి పాల్పడుతున్న 42 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి పెద్ద మొత్తంలో మతపర పుస్తకాలు, ప్రచార సామాగ్రి, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నామని అదనపు పోలీసు సూపరింటెండెంట్‌ కలు సింగ్‌ తెలిపారు. అరెస్టయిన నిందితుల్లో తమిళనాడులోని చెన్నైకి చెందిన జైప్రభు, ఉత్తరప్రదేశ్‌లోని రాబర్ట్స్‌గంజ్‌కు చెందిన అజయ్‌కుమార్‌, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన చెక్కా ఇమ్మాన్యుయేల్‌ ఉన్నారు. మిగతా నిందితులను రాజేంద్ర కోల్‌, ఛోటూ అలియాస్‌ రంజన్‌, పరమానంద్‌, సోహన్‌, ప్రేమ్‌ నాథ్‌ ప్రజాపతి, రామ్‌ ప్రతాప్‌గా గుర్తించారు.

జాతీయ ముప్పుగా పరిగణించాలి: ఆర్‌ఎస్‌ఎస్‌

మత మార్పిడులు ‘జాతీయ ముప్పు’గా పరిగణించాలని, వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్‌ పిలుపునిచ్చింది. గతంలో పుదుచ్చేరిలో 5 కిలోమీటర్ల ర్యాలీ ముగింపు సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు మాట్లాడారు. గతంలో హిందువులలో ఒక నిర్దిష్ట కులాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని మత మార్పిడి చేసేవారని, కానీ ఇప్పుడు అన్ని కులాల వారిని మతం మార్చాలనే లక్ష్యంతో పనిచేయడం అత్యంత ప్రమాదకరమన్నారు.

Tags:    

Similar News