నవ వధువు కళ్ల ముందే భర్తను కాల్చిచంపిన ఉగ్రమూకలు..

రెండు నెలల క్రితం పెళ్లయిన ఉత్తరప్రదేశ్‌ వాసిని హతమార్చిన ఉగ్రవాదులు..;

Update: 2025-04-23 12:16 GMT
వినయ్ నర్వాల్‌ మృతదేహం వద్ద రోధిస్తున్న అతని భార్య
Click the Play button to listen to article

వారికి నాలుగు రోజుల క్రితమే పెళైంది. హనీమూన్‌లో భాగంగా పహల్గామ్‌కు సమీపంలోని మిని స్విట్జర్లాండ్‌కు వచ్చారు. పచ్చిక బయళ్లలో విహరిస్తుండగా..సైనిక దుస్తుల్లో ఉగ్రమూక వారిని సమీపించింది. ఒక్కసారిగా తుపాకీ గురిపెట్టి భార్య ముందే భర్తను కాల్చిచంపారు.

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌(Pahalgam)లో పర్యాటకులపై నిన్న మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు జరిగిన కాల్పుల్లో 26 మంది చనిపోయారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి పాకిస్థాన్ (Pakistan) కేంద్రంగా ఉన్న నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ దాడికి బాధ్యత వహించిన విషయం తెలిసిందే.

‘‘నీ భర్త ముస్లిం కాదు. అందుకే చంపేశాం’’

హర్యానా రాష్ట్రం కర్నాల్‌కు చెందిన 26 ఏళ్ల ఇండియన్ నావీ ఆఫీసర్ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్‌కు నాలుగు రోజుల క్రితం (ఏప్రిల్ 16న) పెళ్లైంది. హనీమూన్‌లో భాగంగా భార్యతో కలిసి పహల్గామ్‌కు సమీపంలోని మిని స్విట్జర్లాండ్‌కు వచ్చారు. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకున్నారు. చాట్ బండార్ దుకాణం వద్ద భేల్‌పురి తింటుండగా ఉగ్రవాదులు వారి వద్దకు వచ్చారు. ఒక్కసారిగా వినయ్‌పై తుపాకీ గురిపెట్టి కాల్చారు. ‘‘ నీ భర్త ముస్లిం కాదు. అందుకే చంపేశాం’’ అని వినయ్ భార్యకు చెప్పి వెళ్లిపోయారు. సైనిక యూనిఫాంలో రావడంతో వచ్చింది ఉగ్రవాదులున్న విషయాన్ని పర్యాటకులు గుర్తించలేకపోయారు.

పెళై రెండు మాసాలే...

ఈ ఉగ్రదాడిలో ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌కు చెందిన శుభం ద్వివేది కూడా కాల్చి చంపారు. ద్వివేదికి రెండు నెలల క్రితం పెళైంది. భార్యతో కలిసి పహల్గామ్ వచ్చారు. ఇద్దరూ కలిసి నూడిల్స్ తింటుండగా..సైనిక దుస్తుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు దగ్గరికి వచ్చారు. "మీరు ముస్లింలా?" అని ప్రశ్నించారు. ద్వివేది సమాధానానికి సంతృప్తి చెందని ఉగ్రవాదులు అతని తలపై తుపాకీని గురిపెట్టి చంపేశారు. అనంతరం అదే ఉగ్రవాది ద్వివేది భార్య తలపై తుపాకీ గురిపెట్టి.. "ఏం జరిగిందో మీ భారత ప్రభుత్వానికి చెప్పు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

కొడుకు మృతి వార్త తెలిసి కాన్పూర్‌లో సిమెంట్ వ్యాపారం చేసే ద్వివేది తండ్రి సంజయ్ ద్వివేది కన్నీటి పర్యంతమయ్యారు. "నా కొడుకు, కోడలు బుధవారం తిరిగిరావాల్సి ఉంది. కానీ ఇలా వస్తాడని ఊహించలేదు’’ అని బోరున విలపించారు.

మృతుల్లో ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్..

పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాకు చెందిన మనీష్ రంజన్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబంతో కలిసి పహల్గామ్‌కు వచ్చారు. ఉగ్రవాదులు ఆయనపై దగ్గర నుంచి కాల్పులు జరపడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

ఉగ్రవాదులు హిందువులనే టార్గెట్ చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News