కొత్త చట్టాలపై ఖర్గే ఏమంటున్నారు?

దేశంలో 150 సంవత్సరాలుగా అమలులో ఉన్న వలస చట్టాల స్థానంలో గత పార్లమెంట్ కొత్త చట్టాలను అమలు ఆమోదించింది. ఈ చట్టాలు నేటి అమలులోకి వచ్చాయి. అయితే వీటిపై..

Update: 2024-07-01 05:30 GMT

దేశంలో ఈ రోజు నుంచి మూడు కొత్త న్యాయచట్టాలు అమలులోకి రాబోతున్నాయి. అయితే వీటిని తాము అంగీకరించడం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. గత లోక్ సభ లో 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి తరువాత మూడు కొత్త క్రిమినల్ చట్టాలను బలవంతంగా ఆమోదించారని ఆయన విమర్శించారు. ఇటువంటి బుల్డోజర్ న్యాయాన్ని తాము అనుమతించమని అన్నారు. దేశ పార్లమెంట్ వ్యవస్థలో వీటిపై సంపూర్ణ చర్చ జరగాలని అన్నారు.

సామాజిక మాధ్యమకం ‘ఎక్స్’ లో ఖర్గే హిందీలో ఒక పోస్ట్‌ చేశారు. “ఎన్నికలలో షాక్ తిన్న తరువాత మోదీ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు నటిస్తున్నారు. అయితే నిజం ఏమిటంటే నేర న్యాయ వ్యవస్థ మూడు చట్టాలు అమలులో ఉన్నాయి. 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన తరువాత ఈ చట్టాలను ఆమోదించారు. ఈ బుల్డోజర్ న్యాయాలను దేశ పార్లమెంటరీ వ్యవస్థ హర్షించదు’’ అని ట్వీట్ చేశారు.

సోమవారం నుంచి కొత్త న్యాయచట్టాలు అమల్లోకి వచ్చాయి. ఇవి దేశ న్యాయ వ్యవస్థలో విస్తృతమైన మార్పులను తీసుకు వచ్చాయి. భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS), భారతీయ సాక్ష్యా అధినియం (BSA) కొన్ని ప్రస్తుత సామాజిక వాస్తవాలు, ఆధునిక నేరాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించబడ్డాయి. కొత్త చట్టాలు వరుసగా బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో వచ్చాయి.

చట్టాల అమలుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. వలస రాజ్యాల నాటి చట్టాలు కేవలం శిక్ష విధించడానికి ప్రాధాన్యత ఇచ్చాయని, కొత్త చట్టాలు న్యాయాన్ని అందిస్తాయని చెప్పారు. సోమవారం (జూలై 1) నుంచి అన్ని ఎఫ్‌ఐఆర్‌లు బిఎన్‌ఎస్ కింద నమోదు చేయబడతాయి. అయితే, అంతకుముందు దాఖలైన కేసులు పరిష్కారమయ్యే వరకు పాత చట్టాల ప్రకారం విచారణ కొనసాగుతాయి.
Tags:    

Similar News