వక్ఫ్ (సవరణ) బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
లోక్‌సభలో బిల్లుకు అనుకూలంగా 288 మంది, రాజ్యసభలో 128 మంది సభ్యులు ఓటేశారు.;
వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ఆమోద ముద్ర వేశారు. ఈ బిల్లుపై బుధవారం లోక్‌సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. సుమారు 13 గంటల చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు. ఆ తర్వాత రాజ్యసభలో ఇదే బిల్లుపై చర్చ నిర్వహించి అనంతరం ఓటింగ్ నిర్వహించారు. అక్కడ కూడా బిల్లుకు అనుకూలంగా 128 మంది సభ్యులు, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటు వేశారు. బిల్లుకు రాష్ట్రపతి కూడా ఆమోదం తెలపడంతో చట్టంగా రూపొందనుంది.
కాగా వక్ఫ్ (సవరణ) బిల్లు(Waqf Amendment Bill) రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తోందంటూ.. కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు.