పోలింగ్ శాతం ఎందుకు పెరుగుతోంది: సుప్రీంలో ఓ స్వచ్చంద సంస్థ పిటిషన్

దేశంలో పోలింగ్ ముగిశాక ఈసీ ప్రకటించే శాతానికి, తుది జాబితా వచ్చాక ప్రకటించే పోలింగ్ శాతానికి మధ్య 4 నుంచి 5 శాతం ఓటింగ్ తేడా ఉంటోందని ఏడీఆర్ అనే సంస్థ సుప్రీంలో

Update: 2024-05-13 08:52 GMT

పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ శాతాన్ని ప్రకటించాలని కోరుతూ ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాల వారీగా పోలింగ్ వివరాలన్నీ ఎన్నికల కమిషన్ తన వెబ్ సైట్లో అప్ లోడ్ చేయాలని ఇందులో సర్వోన్నత న్యాయస్థానాన్ని స్వచ్చంద సంస్థ అభ్యర్థించింది. మే 17న ఈ పిటిషన్ ను విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.

ఎన్జీవో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తరపున వాదిస్తున్న న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటిషన్‌ను అత్యవసరంగా జాబితా చేయాలని కోరగా, జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం లిస్ట్ చేస్తామని ప్రకటించింది.
గత వారం ఈ NGO తను 2019లో దాఖలు చేసిన పిటిషన్ ను మరోసారి దాఖలు చేసింది. అన్ని పోలింగ్ స్టేషన్ల ‘‘ ఫారమ్ 17సీ, పార్ట్-I కాపీలను స్పష్టంగా స్కాన్ చేసి, పోల్ ప్యానెల్ ఎన్నికలు ముగిసిన వెంటనే అప్ లోడ్ చేయాలని కోరింది.
"2024 లోక్‌సభ ఎన్నికలలో ప్రతి దశ పోలింగ్ తర్వాత ఫారం 17C పార్ట్-1లో నమోదైనట్లుగా పోల్ అయిన ఓట్ల సంఖ్యకు సంబంధించిన పూర్తి గణాంకాలతో, అలాగే నియోజకవర్గాల వారీగా ట్యాబులేషన్‌ను అందించాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని అభ్యర్థించింది. ప్రస్తుతం జరుగుతున్న 2024 లోక్‌సభ ఎన్నికల్లో పూర్తి గణాంకాలు సైతం అందించాలి" అని ఎన్‌జిఓ తన సంస్థ తన పిటిషన్ లో పేర్కొంది. ఎన్నికల అవకతవకల వల్ల ప్రజాస్వామ్య ప్రక్రియ దెబ్బతినకుండా ఉండేందుకే ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొంది.
" ఇప్పుడు జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో ఎన్నికల సంఘం చాలా ఆలస్యంగా వివరాలు నమోదు చేస్తోంది. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19 న జరగగా, రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 26 న ముగిసింది. ఈ రెండు దశల పోలింగ్ శాతాన్ని ఏప్రిల్ 30 న వెల్లడించింది. అంటే మొదటి దశ పోలింగ్ ముగిసిన 11 రోజులకు, రెండో దశ పోలింగ్ ముగిసిన 4 రోజుల తరువాత వివరాలు ప్రకటించింది" అని ఏడీఆర్ సంస్థ తన పిటిషన్ లో ఆరోపించింది.
పోలింగ్ రోజున సాయంత్రం ఏడు గంటల తరువాత ప్రకటించిన పోలింగ్ శాతానికి, తరువాత ఈసీ ప్రకటించిన పోలింగ్ శాతానికి సుమారు 4 నుంచి 5 శాతం పోలింగ్ పెరిగినట్లు ఉందని స్వచ్చంద సంస్థ తన పిటిషన్ లో కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఏప్రిల్ 30 నాటి నాటి పోల్ ప్యానెల్ ప్రెస్ నోట్ లో అసాధారణంగా ఐదు శాతం సవరణలతో తుది ఓటింగ్ డేటా విడుదల చేయడంతో ఆందోళనలు, ప్రజల అనుమానాలతో పిటిషన్ దాఖలు చేసినట్లు సంస్థ పేర్కొంది.
పోల్ అయిన ఓట్ల సంఖ్యను పూర్తిగా విడుదల చేయకపోవడం, పోల్ చేసిన ఓట్ల డేటా విడుదలలో "అసమంజసమైన జాప్యం"తో పాటు, ఏప్రిల్ 30న విడుదలైన ప్రారంభ డేటా తుది డేటా మధ్య తీవ్ర పెరుగుదల గురించి ఓటర్ల మనస్సులో భయాందోళనలకు దారితీసిందన్నారు.
"ఈ భయాందోళనలను తప్పక పరిష్కరించాలి . ఓటరు విశ్వాసాన్ని నిలబెట్టడానికి, అన్ని పోలింగ్‌ల ఫారం 17C పార్ట్-I (రికార్డయిన ఓట్ల ఖాతా) స్కాన్ చేసిన స్పష్టమైన కాపీలను తన వెబ్‌సైట్‌లో బహిర్గతం చేయమని ECIని ఆదేశించడం అవసరం. పోలింగ్ ముగిసిన 48 గంటలలోపు పోలైన ఓట్లకు సంబంధించిన ప్రామాణీకరించబడిన గణాంకాలను బూత్ లవారీగా అప్ లోడ్ చేయాలి" అని పిటిషన్ లో పేర్కొంది.
Tags:    

Similar News