అద్భుతమైన ఆటతో “అశుతోష్” విధ్వంసం.

లక్నో సూపర్ జాయంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య సోమవారం జరిగిన ఐపిఎల్ 2025 మ్యాచ్ లో ధనాధన్ బ్యాటింగ్ వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ తేడాతో గెలిచింది;

Update: 2025-03-25 06:49 GMT

అశుతోష్ అంటే సత్వరంగా సంతోషపడేవాడు అని తెలుగులో అర్థం. ఈ మ్యాచ్ లో అశుతోష్ చేసింది అదే. 31 బంతుల్లో 66 పరుగులు( 5 ఫోర్లు,5 సిక్సర్లు) చేసి ప్రేక్షకులను సంతోషపెట్టాడు. అశుతోష్ అంటే శివుడికి ఉన్న ఇంకో పేరు కూడా. దాన్ని బట్టి అశుతోష్ విధ్వంసాన్ని అర్థం చేసుకోవచ్చు.

మధ్యప్రదేశ్ కు ఆడిన ఈ ఆటగాడు, తర్వాత రైల్వేస్ కి ఆడుతున్నాడు. 2023 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో, కేవలం 11 బంతుల్లో అర్థ శతకాన్ని సాధించి అత్యంత వేగంగా అర్థ శతకం సాధించిన భారత ఆటగాడు.

టికెట్లు దొరకని విశాఖవాసులు, 148 పరుగులకు 6 వికెట్లు పడిపోయి ఎలాగూ ఓడిపోతుంది కదా, టీవీ ఆఫ్ చేసి నిద్రపోయిన వాళ్ళు తిట్టుకుంటుంటారు. ఒక అరుదైన ఇన్నింగ్స్ ని ప్రత్యక్షంగా చూడలేకపోయారు చాలామంది. వారితోపాటు ఈ ఐపిఎల్ లో అశుతోష్ వదిలేసిన పంజాబ్ కింగ్స్ జట్టు యాజమాన్యం కూడా, బహుశా పశ్చాత్తాప పడుతూ ఉండొచ్చు. 3.80 కోట్లకు ధైర్యం చేసి ఆశతోష్ ను కొనుక్కున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సంతోషంతో పొంగిపోతుండొచ్చు

లక్నో సూపర్ జాయంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య సోమవారం(24.3.25) జరిగిన ఐపిఎల్ 2025 మ్యాచ్ లో అరుదైన ఆటతో విధ్వంసం సృష్టించి ఓటమి కోరల్లోంచి, విజయాన్ని లాక్కున్న ఆశతోష్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఈ ఐపీఎల్ లో మొదటి సంచలనాత్మక మ్యాచ్. ప్రేక్షకులను, వీక్షకులను ఆద్యంతం అలరించిన ఇన్నింగ్స్ తో ఒక్క వికెట్ విజయాన్ని తన జట్టుకు అందించిన అశుతోష్ ఒక సాధారణ నేపథ్యం ఉన్న యువ ఆటగాడు.

చిరకాలం విశాఖ వాసులకు భారతదేశ ప్రేక్షకులకు గుర్తుంది పోయే మ్యాచ్ ఇది. ఇలాంటి మ్యాచ్ లు ఎప్పుడో గాని ప్రేక్షకులు చూసే అవకాశం లేదు. దానికి కారణం అశుతోష్ తో పాటు,విప్రాజ్ నిగం, ప్రారంభించిన విధ్వంసాన్ని చివరి వరకు కొనసాగించాడు అశుతోష్ . ఈ విధ్వంసం ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా అడ్డదిడ్డంగా బ్యాటింగ్ చేయలేదు. అన్ని సాధారణ క్రికెట్ షాట్లే.

తాను చేయని తప్పుకి మధ్యప్రదేశ్ టీం లోంచి తీసేయడం తో తాను డిప్రెషన్ గురయ్యానని అతనే స్వయంగా చెప్పుకున్నాడు. ట్రయల్ మ్యాచ్లో 45 బంతులకు 95 పైగా పరుగులు చేసినప్పటికీ, కొత్తగా వచ్చిన కోచ్ తను జట్టులోకి తీసుకోకపోవడం చాలా బాధించిందని చెప్పాడు. ఆ తర్వాత రైల్వే జట్టు తనను తీసుకోవడం దైవ కృప అని చెప్పాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని తర్వాత అంతా సెట్ అయిందని చెప్పాడు. 2024 ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ 20 లక్షలతో అతన్ని తీసుకుంది.

అశుతోష్ అనే పేరు దేశవాళీ క్రికెట్ ఫాలో అవుతున్న వారికి కొంచెం తెలుసు. 182.5 స్ట్రైక్ రేట్ బ్యాటింగ్ బ్యాక్ గ్రౌండ్ తో బరిలోకి దిగిన అశుతోష్ శర్మ, కేవలం రెండో ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు.

ఇదివరకు 2024 ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టుతో అరంగేట్రం చేసిన అశుతోష్ 177 స్ట్రైక్ రేట్ తో 189 పరుగులు చేశాడు. మొదటి నాలుగు ఇన్నింగ్స్ లో శర్మ స్కోర్:

31 బంతుల్లో 17 , 15 బంతుల్లో 33 నాట్ అవుట్, 16 బంతుల్లో 31, 28 బంతుల్లో 61

చాలా అరుదుగా ఇటువంటి ఆటను ఆటగాడిని చూడగలుగుతాం. టి 20 మ్యాచ్ లలో ఎప్పుడో ఒకసారి తప్ప ఇలాంటి ఆటతో విజయం సాధించి జట్టును ఓటమి అంచుల నుంచి తప్పించి గెలిపించడం అన్నది చూడలేము. అలాంటి ఒక ఇన్నింగ్స్ ని ఆడిన వాడు అశుతోష్.

210 పరుగుల లక్ష్యాన్ని సాధించవలసిన పరిస్థితిలో 7 ఓవర్ల కే 3 మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందులు పడింది ఢిల్లీ క్యాపిటల్స్. కెప్టెన్ అక్షర పటేల్ 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వెంటనే 65 పరుగులకు డు ప్లెసిస్ పెవిలియన్ చేరాడు.

తర్వాత వచ్చిన మరో సౌత్ ఆఫ్రికా ఆటగాడు స్టబ్స్ పోరాటాన్ని మొదలు పెట్టాడు. 113 పరుగులకు స్టబ్స్ కూడా ఆరో వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు. అప్పుడు వచ్చిన విప్రాజ్ నిగం విధ్వంసాన్ని మొదలుపెట్టాడు. కేవలం 15 పరుగుల్లో 39 పరుగులు చేశాడు. అంతా సజావుగా సాగుతున్న పరిస్థితుల్లో 168 పరుగులకు స్కోర్ చేరినప్పుడు, బాగా ఆడుతున్న విప్రాజ్ నిగం అవుట్ కావడంతో స్కోరు 168 పరుగులకు 7 వికెట్లు.

అప్పుడు నాలుగు ఓవర్లలో 42 పరుగులు చేయాలి. కేవలం మూడు వికెట్లు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో 171 పరుగులకు ఎనిమిదో వికెట్ పడిపోయింది. ఇంక మూడు ఓవర్లలో 39 పరుగులు చేయాలి. అప్పుడు 192 పరుగులకు ఎనిమిదో వికెట్ పడిపోయింది. ఇక 18.3 ఓవర్లలో అంటే 9 బంతుల్లో18 పరుగులు చేయాలి. అశుతోష్ రెండు సిక్సులు కొట్టి స్కోరు చివరి ఓవర్ లో 6 పరుగులకు తెచ్చాడు. మోహిత్ శర్మ ఒక పరుగు తీసి, అశుతోష్ కు బ్యాటింగ్ ఇచ్చాడు. అశుతోష్ ఐదో బంతికి ఒక భారీ సిక్స్ కొట్టి జట్టును 19.4 ఓవర్లలో గెలిపించాడు. ఒక్క వికెట్ తో వికెట్ తో విజయం సాధించిన అనూహ్యమైన మ్యాచ్ లలో ఇది ఒకటిగా నిలిచిపోయింది

ఈ మ్యాచ్ లో 27 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుక్కున్న రిషబ్ పంత్ రెండు తప్పులు చేశాడు. మొదటిది ఒక పరుగు కోసం చేసే ప్రయత్నంలో అశుతోష్ శర్మను రనౌట్ చేసే అవకాశాన్ని జారవిడుచుకున్నాడు. రెండోసారి మోహిత్ శర్మ ముందుకు వెళ్లి ఆడినప్పుడు స్టంపింగ్ చేసే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు.

తన కెరియర్ ఆరంభంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన అశుతోష్ ఈ ఐపీఎల్ లో, కొంతమంది కెప్టెన్లకు, బౌలర్లకు నిద్రలేని రాత్రులు, నిద్ర పోలేని రాత్రులు ఇచ్చే, అవకాశం ఉంది. ప్రేక్షకులకు మాత్రం ఆనందాన్నిస్తూ అలరించే అవకాశాలు కనబడుతున్నాయి

ఇంతవరకు ఐపీఎల్ లో ఒక వికెట్ తో విజయం సాధించిన జట్లు

ఇంతవరకు ఐదు సార్లు మాత్రమే రెండోసారి బ్యాటింగ్ చేస్తున్న జట్టు ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది.

1. 2015 లో ఒక సంచలనాత్మక మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ కింగ్స్ పంజాబ్ ని ఓడించింది.

కింగ్స్ పంజాబ్ 184 పరుగులు. కేకేఆర్ 185 పరుగులు

2. 2018 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ని ఓడించింది. అది ఆ సీజన్లో మొదటి మ్యాచ్ 2018 లో ముంబై ఇండియన్స్ 165 పరుగులు చెన్నై సూపర్ కింగ్స్ 169 పరుగులు

3. 2018 ముంబై ఇండియన్స్ జట్టును సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓడించింది

ముంబై ఇండియన్స్ 147 పరుగులు సన్రైజర్స్ హైదరాబాద్ 151 పరుగులు

4. 2023 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 213 పరుగులు, లక్నో సూపర్ జెంట్స్ 214 పరుగులు

Tags:    

Similar News