ఈరోజే ఐపీఎల్ 2025 ఆరంభం

2025 మార్చి 22 తారీఖున మొదలయ్యే 18 వ సీజన్(ఎడిషన్), మే 25న జరిగే ఫైనల్ తో ముగుస్తుంది.;

Update: 2025-03-22 11:44 GMT

 చివరికి ఆరోజు వచ్చేసింది .మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2025 ప్రారంభం కాబోతోంది.

ఈరోజుతో 74 రోజుల ఐపీఎల్ పండగ మొదలవుతుంది. ఎవరు గెలుస్తారు అన్నది అంత ముఖ్యం కాదు. ఎవరు ప్రేక్షకులను ఎంతగా అలరిస్తారు అన్నది ముఖ్యం.

మండే ఎండలు ఉన్నప్పటికీ, ప్రేక్షకులు మాత్రం స్టేడియంలో సందడి చేయబోతున్నారు.ఇక ఏ జట్టు గెలుస్తుంది అనే దానికన్నా, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అని చర్చలు ఎక్కువ ఉంటాయి. వేసవి సెలవులు కూడా ప్రారంభమైనందువల్ల స్టూడెంట్స్ (కొన్నిచోట్ల పదో తరగతి తప్ప) ఇక పుస్తకాల మీద కన్నా, ఐపీఎల్ మీద ఎక్కువగా దృష్టి పెడతారు.

మొదటి కప్ కోసం ఆడుతున్న చాలెంజర్స్ గెలుస్తుందా?

ఐపీఎల్ లో ఈరోజు డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కత్తా నైట్ రైడర్స్, ఒక్క ఐపిఎల్ కూడా గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో ఢీకొంటుంది. కోల్కత్తా నైట్ రైడర్స్ నాలుగో ట్రోఫీ కోసం ప్రయత్నం చేస్తుంది.

కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. వర్షం ముప్పు పొంచి ఉన్నప్పటికీ, మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువ. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. వర్షం ముప్పు పొంచి ఉన్నప్పటికీ, మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువ.

కోల్కత్తా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఇంతవరకు రెండు జట్ల మధ్య జరిగిన 34 మ్యాచ్లలో, కేకేఆర్ జట్టు 20 మ్యాచ్లలో విజయం సాధించింది, 14 మ్యాచ్లలో ఆర్సిబి గెలిచింది. కేకేఆర్ విజయ శాతం 58. అంతమాత్రాన కేకేఆర్ సులభంగా విజయం సాధిస్తుందని చెప్పలేం. ఎందుకంటే 17 సీజన్లలో మూడు సార్లు ఫైనల్ కి వచ్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, విజయం సాధించలేకపోయింది.

రాయల్ చాలెంజర్స్ ఎక్కువసార్లు బ్యాటింగ్ తోనే గెలిచింది.

ఇంతవరకు ఇద్దరి మధ్య జరిగిన పోటీలో 14 సార్లు గెలిచిన రాయల్ చాలెంజర్స్ 11 సార్లు రెండవసారి బ్యాటింగ్ చేస్తూ గెలిచింది, మూడుసార్లు మాత్రమే మొదటిసారి బ్యాటింగ్ చేసి, ఒక లక్ష్యాన్ని రాయల్ చాలెంజర్స్ కి ఇచ్చి, దాన్ని కాపాడుకొని గెలిచింది. దీన్నిబట్టి చూస్తే లక్ష్యాన్ని సాధించడంలోనే ఎక్కువసార్లు విజయం సాధించింది. ఆ లెక్కన ఈ మ్యాచ్లో ఒకవేళ టాస్ గెలిస్తే, కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టును బౌలింగ్ చేయమని ఆహ్వానించే అవకాశం ఎక్కువ ఉంది. లక్ష్యాన్ని సాధించడం కూడా తక్కువ వికెట్లు కోల్పోయి సాధించింది.

ఇద్దరి మధ్య జరిగిన 34 మ్యాచ్లలో కేకేఆర్ జట్టు 20 మ్యాచ్ లు (58%) గెలిచింది. అందులో పది మ్యాచ్లు మొదట బ్యాటింగ్ చేస్తూ, మిగతా పది మ్యాచ్లు రెండోసారి బ్యాటింగ్ చేస్తూ విజయం సాధించింది. ఆ లెక్కన ఒకవేళ కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిస్తే వాతావరణ పరిస్థితులు, పిచ్ మీద ఆధారపడి మొదట బ్యాటింగ్ చేయాలా లేదా అన్న విషయం నిర్ణయించుకునే అవకాశం ఉంది.

ఇరుజట్ల బౌలింగ్ పరిశీలిస్తే కోల్కతా నైట్ రైటర్స్ కొంత బలంగా కనబడుతుంది. ఇప్పుడు అందరి దృష్టి అంతా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మీదే ఉంటుంది, కోల్కత్తా నైట్ రైడర్స్ ఆటగాడు అయిన వరుణ్ చక్రవర్తి ఐసీసీ ప్రపంచ ఛాంపియన్షిప్ లో తన సత్తా చూపించాడు. భారత్ గెలవడానికి ప్రధాన కారకుడు అయ్యాడు. అతనికి తోడు హర్షిత్ రానా కూడా ఐసీసీ చాంపియన్స్ టా లో మెరిశాడు. ఆల్రౌండర్ బౌలర్లు మోయిన్ అలీ కూడా ఒక మంచి బౌలరే. ఇంకా సునీల్ నరేన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ చూస్తే భువనేశ్వర్, హేజల్ వూడ్ తప్ప ఇతరులు పెద్దగా రాణించలేదు. కృణాల్ పాండ్యా కేకేఆర్ బ్యాట్స్మెన్లను కొంత ఇబ్బంది పెట్టొచ్చు.

ఇక బ్యాటింగ్ చూస్తే అజీంకే రహానే నిలకడగా అడగలడు. రింకు సింగ్, సునీల్ నరేన్, రసెల్ స్కోరును పరిగెత్తించగలరు. తమదైన రోజున వీళ్లు ప్రత్యర్థి జట్టుకు చాలా ప్రమాదకరమైన బ్యాట్స్మెన్. నరేన్ బ్యాటింగ్ అవేరేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. బెంగళూరులో చూస్తే కోహ్లీ,పడిక్కల్ తప్ప మిగతా వాళ్ల మీద జట్టు ఆధారపడలేదు. విదేశీ ఆటగాడు అయిన ఫీల్ సాల్ట్ కొంతవరకు జట్టును ఆదుకునే అవకాశం ఉంది.

చివరగా చెప్పాలంటే మూడుసార్లు గెలిచిన కేకేఆర్, ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కన్నా కొంత మెరుగైన జట్టు అని చెప్పాలి. ఈసారి ఎలాగైనా గెలవాలని ఆడుతున్న రాయల్ చాలెంజర్స్ ఒత్తిడిలో ఉంటుంది. కేకేఆర్ కు తక్కువే. పైగా పాటిదార్ మొదటిసారి రాయల్ చాలెంజర్స్ కు కెప్టెన్ గా ఉన్నాడు.

తారుమారైన కెప్టెన్లు

ఈ ఐపీఎల్ లో మొదటిసారి 9 మంది భారతీయులు కెప్టెన్ లు గా ఉన్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఒక్కడే విదేశీ ఆటగాడు. పైగా ఐదు జట్లకి, కొత్త కెప్టెన్ లు ఉన్నారు. కొంతమంది ఆటగాళ్లు అటూ ఇటూ మారిపోయారు. కొంతమంది ఆటగాళ్లను భారీ వేలంలో, ఎక్కువ డబ్బులు పెట్టి కొన్న ఫ్రాంచైజీ లు కూడా ఉన్నాయి. కొత్త వారితో జట్లు ఇబ్బంది పడే అవకాశం ఉంది, రిషబ్ పంత్, అయ్యర్, రహానే, పాటీదార్, అక్షర్ పటేల్ లాంటి వాళ్లకి ఇబ్బందే.

కొత్త నిబంధనలు

గతంలో బాల్ కు ఉమ్మిని పూసి, దాన్ని బౌలింగ్కు అనుగుణంగా మార్చే పద్ధతికి నిషేధం ఉండింది. పైగా కరోనా కూడా దానికి కారణం. ఈసారి మాత్రం దాన్ని ఎత్తేశారు. ఇంకొక కొత్త సౌకర్యం కూడా బౌలింగ్ జట్టుకు ఇచ్చారు. 10 ఓవర్ల తర్వాత, ఎంపైర్ అనుమతితో ఇంకో బంతి తీసుకోవచ్చు. కానీ ఆ బంతి కూడా పాత బంతిలాగే ఉండాలి. ఇది మంచు వల్ల బౌలింగ్ జట్టు ఇబ్బంది పడే పరిస్థితిలో మాత్రమే అనుమతిస్తారు.

పొంచి ఉన్న వర్షం ముప్పు

రాత్రి 7:30 గంటలకి మ్యాచ్ ప్రారంభమవుతుంది కనుక, అప్పుడు వర్షం పడే అవకాశాలను కొంచెం ఉన్నాయి అని వాతావరణ శాఖ తేల్చింది. అయినప్పటికీ మ్యాచ్ ఏదో విధంగా జరుగుతుందని అనుకుంటున్నారు.

క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్న ధోని!?

తన ఆటతో జట్టును ఆదుకుంటూ, గత 15 సంవత్సరాలుగా ఐపీఎల్ ఆడుతున్న మహేందర్ సింగ్ ధోని కు ఇది చివరి మ్యాచ్ కావచ్చు. ఐదు సంవత్సరాల క్రితం భారత జట్టు తరఫున ఒక్క అంతర్జాతీయ మ్యాచు కూడా ఆడని ధోని ఈ సీజన్ తర్వాత క్రికెట్కు బై బై చెప్పే అవకాశాలు ఎక్కువ. గత 20 సంవత్సరాలుగా భారత క్రికెట్ లో తనదంటూ ఒక స్టైల్ లో క్రికెట్ ఆడి ప్రేక్షకులను అలరించిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ధోని, చాలా కాలం గుర్తుంటాడు. తన హెలికాప్టర్ షాట్ ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ధోని రిటైర్ కావడం వల్ల చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, ఒక మంచి ఆటగాడిని, కెప్టెన్ ను, ఒక వ్యూహ కర్తను పోగొట్టుకుంటుంది.

Tags:    

Similar News